Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 2:48 pm Posted by : praja deveena

Minister PongulatiSrinivasReddy: బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి కీలకప్రకటన,ఇందిరమ్మఇండ్ల చెల్లింపుల్లో స్వల్పమార్పులు

 

Minister PongulatiSrinivasReddy : ప్రజా దీవెన హైద రాబాద్: ఇందిర మ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడత లుగా అందచేస్తున్న బి ల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌ ర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకట న చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినా లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐ హెచ్ హెచ్ఎల్ ) పనులను చేసు కోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమ తి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు.

కేవలం చెల్లింపుల షెడ్యూల్ లో మాత్రమే మార్పులు జరుగుతున్నా యి తప్పితే, లబ్ధిదారులకు మం జూరు చేసే రూ. 5 లక్షల మొత్తం లో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ప థకంలో బేస్ మెంట్ వరకూ నిర్మా ణం పూర్తి అయితే ఒక లక్ష రూపా యలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తు తం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లి స్తున్నారు. ఉపాథి హామి పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రో జుల పనిది నాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దే శించి న మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుందన్నారు.

ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొ త్తాన్ని రూ.1.40 లక్షలుగా అందే చేయాలని ప్రభుత్వం నిర్ణ యించినట్లు మంత్రి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరు వాత రూ. 1. 40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అ వుతాయని, మిగి లిన మొత్తాన్ని (రూ.60 వేలను) కూడా లబ్దిదా రుల ఖాతాల్లో ఉపా థి హామీ పథకం కింద అందచేస్తారని తెలిపా రు.

అదే విధంగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తారు. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయ ని, లబ్ధిదారులు ఈ మార్పును గ మనించి ప్రభుత్వంతో సహకరిం చాల్సిందిగా మంత్రి కోరారు.