Minister Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, రెవెన్యూ సంస్కరణ లతో నవశకానికి శ్రీకారం
--ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు,భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం --అదనపు ఎమ్మార్వోల నియామకం, ఏచిన్న పొరపాటు జరిగిన ఉపేక్షించేది లేదు --ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమా నులకు తమ భూమి పై స్పష్టమైన హక్కు లను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవె న్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మం త్రి పొంగులే టి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం పేదల జీ వితాల్లో శాశ్వత మార్పు తీసుకురా వాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతోందన్నారు. ఇల్లు, భూమి ప్రతి కు టుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని పేదవాడికి భద్రమైన భవిష్యత్తు క ల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు.
పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డినాయక త్వంలోని ప్రజాప్రభుత్వం ఇందిర మ్మ ఇండ్లు అనే మహత్తర కార్యక్ర మాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద పేద కు టుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మా ణం కోసం ఒ క్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహా యం అందిస్తు న్నా మని తెలిపారు. దాదాపు 4 ల క్షల ఇళ్లను మంజూరు చేసి, రా ష్ట్రవ్యాప్తంగా గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామని చె ప్పారు.
హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జి ల్లాల వారీగా ప్రజా ప్రతిని ధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా గురువారం నాడు హౌసింగ్ కార్పొ రేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి న ల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మం త్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, జి ల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధి కారాలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అ మలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థాని క ప్రజాప్ర తి ని ధులతో సమన్వయం తో వ్యవహరించాలని జిల్లా స్థాయి లో అధికారయంత్రాగమంతా సమ న్వయంతో పనిచేస్తే అ క్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభు త్వ లక్ష్యాలకు అను గుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదే శించారు. ఇందిరమ్మ ఇండ్ల ప థకం అమలులో అత్యధిక శాతం అధికారాలను కలెక్టర్లకే దఖలు పరిచామన్నారు.
ఇం దిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చి, మొదటి బిల్లు వారి ఖాతా ల్లో జమ అయిన లబ్ధిదారులం దరికీ తదుపరి విడతల బిల్లులన్ని టిని సకాలంలోనే విడు దలయ్యేలా చూడాలని మంత్రిగారు కలెక్టర్లను ఆదేశిం చా రు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎ టువంటి అక్రమాలకు తావివ్వ కుం డా, పూర్తి పారదర్శకంగా జవాబు దారీ తనం తో పనిచేస్తూ అర్హులైన వారికే ఫలాలు దక్కేలా చూడాలని ఈ విషయం లో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.
గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సే కరించి పూర్తి స్థాయిలో వినియో గించకుండా మిగిలి ఉన్న భూము ల్లో అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చా రు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథ కంలో ఇల్లు మంజురైనా వివిధ కారణలతో నిర్మా ణాలను పూర్తి చే యని వారికి కూడా వెసులుబాటు కల్పిం చే యోచనలో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా జిల్లాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరక్టర్లు పూర్తి బాధ్యతా యు తంగా విధులను నిర్వహించాలని, లబ్ధిదారులు, ఉ న్నతా ధికారుల మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తూ సమ స్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల ని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల ని ర్మాణపు పనులు ఏ స్థా యిలో ఉ న్నా, ఈ నెల 20 వ తేదీలోగా లబ్ధి దారుల ఎంపి కను పూర్తి చేయా ల ని, ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతిని ధులు కూడా చొరవ చూపా లని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అర్హులైన పేద ల నే లబ్ధిదారులగా ఎంపి క చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రి జిస్ట్రేషన్ కార్యాల యాల కు నూతన భవనాలను ని ర్మిం చేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, ఈ కార్యాలయాల న్నిటి ని ప్రజ లకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నెలకొ ల్పేలా జిల్లా కలెక్ట ర్లు చ ర్యలు తీసుకోవాలని మంత్రి సూ చించారు. అలాగే లక్షకుపైగా జనాభా ఉన్న మండలాల్లో, అవ సరాని కి అనుగుణంగా, అదనంగా మరో తహశీల్దార్ ను నియమించనున్నామని మంత్రి తెలిపారు.
ఇందు కు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సి ద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్నభూవి వాదాల సమస్యకు శాశ్వత పరి ష్కారం కో సం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గ మ న్నారు. ఈ దిశలో మరింత వేగ వంతమైన చర్యలు తీసుకో వాలని అటవీ, రెవె న్యూ అధికారులకు మంత్రి స్పష్టం చేశా రు.
గతంలో ఎన్నడూ లేనట్లుగా రెవె న్యూ విభాగంలో అనేక సంస్కరణ లు తీసుకుని వచ్చి ఆర్డీవోలకు వి స్తృతమైన అధికారాలు కల్పించా మన్నారు. ప్రజా సమస్యల పరి ష్కా రానికి కాకుండా, ఇతర ప్రయో జనాలకు వీటిని విని యోగి స్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రా ష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెం ట్స్ మరియు భూ రికార్డుల శాఖ ద్వారా స మగ్ర సంస్కరణలు అమ లు చేస్తున్నామని మంత్రి పేర్కొ న్నారు. భూ రికార్డుల్లో పారదర్శక త, ఖచ్చితత్వం తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పం తో ము ఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంద ని మంత్రి పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగేలా వ్యవస్థ ను బలోపేతం చేస్తు న్నామని అన్నారు.ఈ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఇన్ ఛార్జి మంత్రి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెం కట్, వాకాటి శ్రీహ రి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వై స్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






