Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 3:45 pm Posted by : praja deveena

Minister Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీ లక ప్రకటన, స‌మీకృత‌ భూభార‌తి పోర్ట‌ల్‌తో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

 

Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలం గాణ రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో వి ప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల కు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవె న్యూ హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మం త్రి పొంగులే టి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌ డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను త‌యారు చేశామ‌న్నారు.

ఈ పోర్ట‌ల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌ యోగాత్మ‌కంగా ప్రారంభించి భూవివాదాల ప‌ రిష్కారానికి తొలిఅడుగు వేయ‌బో తున్నామ‌ని వెల్ల‌డించారు.ఇక్క‌డ వ‌ చ్చే ఫ‌లితాల‌ మేరకు అ వ‌స‌ర‌మై న మార్పులు చేర్పులు చేసి భ‌విష్య‌త్తులో ముందుకు వెళ్లాల‌ని ని ర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. కేర‌ళం ప‌ ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి బుధ‌వారం ఈ పోర్ట‌ల్ ప్రా రంభా నికి సంబంధించి రెవెన్యూ అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూ భార‌తి పోర్ట‌ల్‌ను రైతు కోణంలో రూపొందించామ‌ని సామా న్య ప్ర‌జానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇ బ్బం దులు క‌ల‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారు ల‌ను ఆదేశించారు.ఏప్రిల్ 2నుంచి ఖ‌మ్మం జిల్లా కుసుమం చి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట‌, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, నారాయ‌ణ‌పే ట జిల్లా కొస్గి మండ‌లాల్లో ప్ర‌యో గాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్లు వె ల్ల‌డించారు. ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యే క దృష్టి సారించాల‌ని సూచించారు.

గ‌తంలో మాదిరిగా రైతులు త‌మ భూసేవ‌ల కోసం మీ సేవ కేంద్రాల‌ కు వెళ్లవ‌లసిన ప‌నిలేకుండా త‌న‌ ఇంటి నుంచే భూ సేవ‌లు పొందేవి ధంగా పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ న్నారు. రైతులు త‌మభూమి హ‌ద్దు లు తేల్చాల‌ని స‌ర్వే అధికారుల చు ట్టూ తిరిగేవార‌ని, ఇప్పుడు ఎ క్క‌డికీ వెళ్ల‌కుండా ఇంటి నుంచే భూభార‌తి పోర్ట‌ల్ ద్వారా పొంద‌వ‌ చ్చ‌న్నారు. రైతు లాగిన్ అయిన వెం ట‌నే త‌న‌కు ఉన్న భూమి వివ‌రాలు క‌ని పిస్తాయి. ఎన్నిఎక‌రాల‌కు స‌ర్వే కావాలో కోరితే అందుకు సంబం ధించిన ఫీజు ఎంత‌చెల్లించాలో క‌ని పిస్తుందన్నారు. ఫీజు చెల్లించిన త‌ ర్వాత ఆ వివ‌రాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ లాగిన్‌ కు వెళుతుంది. ఆత‌ర్వాత రెం డు రోజ‌ల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతుల‌కు నోటీ సులు జారీ చేస్తారని తెలిపారు.

త‌ర్వాత ఏడు రోజుల్లోపు స‌ర్వే తేదీని స‌ద‌రు లై సెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ ఖరారు చేయ‌డ‌ మేగాక స‌ర్వేకూ డా రోవ‌ర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్ట‌మ్‌లో న‌మోదు చేశాక అది మం డ‌ల స‌ర్వేయ‌ర్ స్య్రూటినీకి వె ళుతుంది. ఆపై మండ‌ల త‌హ‌శీల్దార్ ఆమోదం పొందాక ద‌ర‌ఖాస్తుదా రైన రైతుకు ఎల్‌పి ఎమ్‌, భూధార్ నెంబ‌ర్‌ల కేటాయింపు జ‌రుగుతుం దన్నారు. ఈ వివరాలు భూభార‌తి పోర్ట‌ల్‌లో కూడా నిక్షిప్త‌ మ‌వుతాయన్నారు.స‌ర్వే పూర్త‌యిన త‌ర్వా త స‌ర్వే మ్యాప్ ను జ‌న‌రేట్ చేసి భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈప్ర‌క్రియ‌లో రిజిస్ట్రేష‌న్ ద‌ ర‌ఖాస్తు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుం చి పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో పౌరు ల రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ ఎమ్ ఎస్ అల‌ర్ట్స్ పంపిస్తారని చె ప్పారు.

భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూము ల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌ యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబం ధ‌న‌ను ఈ ఐదుమండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌ని ఈ ఐ దు మండ‌లాల్లో ప్ర‌తి స‌ర్వే మ్యాప్ ( ఎల్‌పిఎమ్‌) యూనిక్‌ నెంబరు, అదేవిధంగా ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మాదిరిగానే భూధా ర్ నెంబ‌ర్‌ను కూడా ఇస్తామ‌ని వెల్ల‌ డిం చారు. ఈ ఐదు మండ‌లాల్లో రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ త‌ర్వా త స‌ర్వే నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ ను అందుబాటులో ఉంచామ‌ని అలాగే గొలుసులు, క‌ర్ర‌లు, క్రాస్ స్టాఫ్‌, మెజ‌రింగ్ టేప్ వంటి పాత స‌ర్వే ప‌రిక‌రాల‌కు స్వ‌ స్తి చెప్పి రోవ‌ర్ల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

దీనివ‌ల్ల స‌ర్వే ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతుంద‌ని, క‌చ్చి త‌మైనస‌ర్వే వివరాలు వ‌స్తాయ‌ని తెలిపారు. భూ స‌మ‌స్య‌ లు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయ‌ని వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందు కు ఇంటిగ్రేటెడ్ భూభార‌ తి పోర్ట‌ల్ ఒక కీల‌క‌మైన ముంద‌డుగు అని రైతు ఇంటి నుం చే అన్నిసేవ‌లు పొందేలా పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్ధ‌ను తీసు కువ‌ స్తున్నామ‌ని ఇది రెవెన్యూ వ్య‌ వ‌స్ధ‌లో చారిత్రాత్మ‌క మార్పు న‌కు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.