Minister Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్య, తెలంగాణ పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్
-- క్యూర్ పరిధిలో అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్ లక్కీ డ్రా -- 16 నియోజకవర్గాల్లో సుమా రు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా --రోజుకు నాలుగు నియోజ కవ ర్గాల చొప్పున ప్రక్రియ --పేదలకు రూపాయి ఖర్చులేకుండా ఉచిత రిజిస్ట్రేషన్

Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రా బాద్ మహానగరంలో నిరుపేదల సొం తింటి కలను నిజం చే స్తూ వారి ఆత్మగౌరవానికి ప్రతీ క గా నిలిచే ఇందిరమ్మ టవ ర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్ది దారుల ఎంపిక చేపడు తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసం బం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి తెలిపారు. అర్హతే ప్రామాణి కం గా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగు తోం దని స్పష్టం చేశారు.క్యూర్ ప్రాంతంలో తొలి విడత గా చేప డుతున్న ఇందిరమ్మ టవ ర్స్ లో ఫ్లాట్ల కేటాయింపునకు అ త్యంత పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధి దారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామా జిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తు న్నామని చెప్పారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లా పూర్, సి కింద్రాబాద్, రాజేంద్రన గర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంది రమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డె న్స్‌లో, రాజేంద్రనగ ర్ నియోజ కవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబం ధిం చి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్ర మాల్లో మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమా రు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నా లుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగు తుందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లా ట్లకు 600 మంది లబ్ధిదారు లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించా రు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపి కైన వారిలో ఎవరైనా అనర్హు లు గా తేలితే మిగిలిన 120 మంది లోని అర్హులకు అవకాశం కల్పి స్తామని చెప్పారు. ఈ విధానం ద్వా రా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ లో ఇందిరమ్మ టవ ర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రి కార్డు సమయంలోనే 16 నియో జక వర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ని ర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రా ష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయ మని అన్నారు.
క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యం గా పె ట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపా రు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తిం పు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇంది రమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీ కరిస్తామని మంత్రి వెల్లడించా రు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి న తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యా ప్తంగా తొలి విడతలో 4.50 ల క్ష ల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మం త్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూ ర్తయ్యాయని చెప్పారు.ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహా యాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమ య్యా యని వివరించారు.రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల ను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవం తం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడ త లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అ వకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టు కోవడం కంటే పేదవాడి ఆత్మగౌ ర వానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నా రు. ఎకరం రూ.100 కోట్లు, రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు విలు వ చేసే ప్రాంతాల్లోనూ పేద కు టుంబాలు గౌరవంగా జీవించాలి అని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొం దిన అర్హులైన లబ్ధిదారుల కు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రే షన్ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదు పాయం ఉంటుందని చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవ సర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రే షన్ డాక్యుమెంట్‌ను బ్యాంకు లో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం కూడా ఉం టుందని వివరించారు.లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధి దారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇం టిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటి కి 17 నుంచి 20 గజాల అన్‌డివై డెడ్ షేర్ భూమి కూడా ఉం టుందని తెలిపారు.ప్రభుత్వం గుర్తిం చిన స్థలాల్లో అవసరా న్ని బట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామ ని, లిఫ్ట్‌లతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపా యాలను కల్పిస్తామని చెప్పారు.
లక్కీడ్రా పూర్తయిన తర్వాత ల బ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికె ట్లు అందజేస్తా రని మంత్రి తెలిపారు. ఆ తర్వా త కేవలం 3–4 రోజుల్లోనే ట వ ర్స్ నిర్మాణ పనులు ప్రారంభించే లా చర్యలు తీసుకుంటామని చె ప్పారు.లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా ప ర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో నిర్వ హించిన లక్కీడ్రాలో తొలుతఎస్సీ విభాగానికి కేటాయించిన 14 శా తం రిజర్వేషన్ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్ములో వేశారు. మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థా నిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హౌసింగ్ ఎండీ వి.పి. గౌతమ్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికా రుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు.ఎస్సీ విభా గంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృ ష్ణవేణి ఎంపిక కాగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూ య, ఎం.కుమారి, శైలజాకుమారి వరుసగా ఫ్లాట్లను లక్కీడ్రా ద్వా రా పొందారు.ప్రతి నియో జ కవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమ లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీలకు – 14 శాతం, ఎస్టీలకు – 5 శాతం, బీసీ లకు – 16 శాతం, దివ్యాం గు ల కు – 5 శాతం పారిశుధ్య కార్మి కులు, నాలుగో తరగతి ఉ ద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కు – 10 శాతం చొ ప్పున రిజర్వే షన్లు అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ ఫ్లాట్లలో మొ త్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మొ త్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తు న్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.





