Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, రబీ ధాన్యం చివరిగింజనూ మద్దతు ధ రతో కొనుగోలు చేస్తాం

--మొత్తంగా రాష్ట్రoలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం --4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం --రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడి.

 

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, నల్లగొం డ: దేశంలో వ రి పండించడంలో తెలంగాణ మొదటి స్థానం లో ఉందని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిందని రాష్ట్ర పౌర స రఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి అన్నా రు. గురువారం నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ అభివృ ద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూ రు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వివరాలు తె లుసుకున్న అనంతరం అక్కడే రైతులతో ఏ ర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గడచిన రెండున్నర సం వత్సరాలలో అత్యధికంగా వరి పండించిన కొనుగోలు చేసి న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

ప్రతి రైతుకు మద్దతు ధర వచ్చే వి ధంగా రాష్ట్ర ప్రభుత్వం 22 వేల కో ట్ల రూపాయలను చెల్లించి ధాన్యా న్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రబీ లో 6 5 లక్షల ఎకరాలలో 140 లక్షల మె ట్రిక్ టన్నుల వరిపండింద ని తెలి పారు. అందులో 80 నుండి 90 ల క్షలు మెట్రిక్ ట న్నులు ప్రభుత్వం కొనుగోలు చేయనుందని, ధాన్యం కొనుగో లుకై 18.67 కోట్ల గన్ని బ్యా గులను పిపిసి సెంటర్లకు పంపిం చినట్లు మంత్రి వెల్లడించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి సెంటర్ తో పా టు, మండల, నియోజ కవర్గ స్థాయిలో అధికారులను ని యమించామని ధాన్యం కొనుగో లుకు అన్ని రకాల వాహనా లను వినియోగించుకునేలా జి ల్లా కలెక్టర్ల కు విస్తృత అధికా రాలు కల్పించా మని, రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగో లుకు 8575 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్ప టి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామ ని,46 00 కోట్ల రూపాయలు రైతు ల అకౌంట్లలో జ మ చేయడం జరిగిందని,రానున్న రెండు, మూడు రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించడం జరుగు తుందని,అలాగే 3000 కోట్ల రూ పాయలు రైతుల ఖాతా లలో జమ చేయనున్నామని చెప్పారు.

 

మూడు లక్షల 84,000 మంది రై తుల ధాన్యాన్ని ఇప్పటివ రకు కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడిం చారు. నల్గొండ జి ల్లాకు సంబంధిం చి ఐదు లక్షల 46000 ఎకరాల్లో 1 4 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని, ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నల్గొండ జిల్లాలో 7 లక్షల 24 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, న ల్గొండ జిల్లాలోనే 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించామని, కోటి 22 లక్షల గన్ని బ్యాగులు ఇచ్చామన్నారు. .

53,611 మంది రైతులకు మద్దతు ధర చె ల్లించి 692 కోట్ల రూపాయల రై తుల ఖాతాలో జమచేయడం జరి గిందని, రెండు, మూడురోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల లో ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు వెల్ల డించారు. జిల్లాలో 1000 వా హ నాలను రబీధాన్యంకై ఏర్పాటు చే యడం జరిగింద ని, రైతులు పం డించిన ధాన్యాన్ని ఎంఎస్పీ చెల్లించి కొనుగో లు చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు తీసుకుంటున్న దని చెప్పారు.

ధాన్యం సేకరణలో పశ్చిమ బెంగా ల్ కూలీలను వినియోగి స్తు న్నందున అక్కడ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హమాలీల సమస్య ఉత్పన్నమైందని,తరుగు, తాలు విష యంలో మిల్లర్లు ,ట్రేడర్లు రైతు లను ఇబ్బంది పెడితే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించా రు. రాష్ట్రవ్యాప్తంగా 1800 మిల్లు లు ఎంఎస్పి ఆపరేషన్ లో పాల్గొం టున్నాయ ని, 12 లక్షల మెట్రిక్ ట న్నుల సామర్థ్యం కలిగిన ఇంటర్మీడి యట్ గోదాం సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని మం త్రి వెల్లడించారు.

రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సం క్షేమ శాఖ మంత్రి, నల్గొం డ జిల్లా ఇ న్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లా డుతూ రబీలో రైతు లు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని, అంతేకాక నిర్దేశించిన సమయంలో రైతుల ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేయడం జరు గుతుందని, ట్రా న్స్పోర్ట్ , హమాలి సమస్యలను అ ధిగమిం చేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకున్నదని, ఈసారి పెద్ద ఎ త్తున పంట వచ్చిందని, రైతులకు కష్టం కలగకుండా రైతుల చెంతకే వచ్చి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యాన్ని కొంటున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే ఈ రబీలో నల్గొండ జిల్లాలో అత్యధిక ధాన్యం పండిందని, గ తంతో పోలిస్తే 30000 మెట్రిక్ ట న్నుల ధాన్యం అధికoగా పండిన ట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు లో ఏర్పడిన హమాలి, ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించడం జరి గిందని బుధ వారం ఒక్కరోజే న ల్గొండ జిల్లాలో 19000 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ డం జరిగిందని, రానున్న పది రోజు ల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తా మని తెలిపారు. ఏఎంఆర్పి కాలు వల లైనింగ్ కోసం 450 కోట్ల రూ పాయ లను ఖర్చు చేయడం జరు గుతున్నదన్నారు.

ఎస్ఎల్ బిసి సొ రంగం పూర్తయితే జిల్లాలో మరింత దా న్యం దిగుబడులు పెరుగుతా యన్నారు. లారీలు అవసరం ఉం టే మరిన్ని వినియోగించాలని, ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రాధాన్యత క్ర మంలో లారీ లు అవసరం ఉన్న కొనుగోలు కేంద్రాలకు ముందుగా పం పించాలని చెప్పారు. రైతులకు ఇ బ్బంది కలగకుండా ధా న్యం కొనుగోలు సాఫీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించా రు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పౌరసరఫ రాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీం ద్ర, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎ స్పీ శరత్ చంద్ర పవార్, రైతు కమి షన్ సభ్యులు చెవిటి వెంకన్న, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమే ష్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిసిఓ ప త్యా నాయక్, పౌరరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతినాయక్, డిఎ స్ఓ వెంకటేశం, మార్కె టింగ్ శాఖ ఏడి ఛాయాదే వి, ఇతర అధికారులు, ప్రజా ప్రతి నిధులు, తదితరులు మంత్రుల వెంట ఉన్నారు.

Related Articles

Back to top button