OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య, రైతుల పేరుతో డ్రామాలొ ద్దని కేటీఆర్ పై ఫైర్ 

--కేటీఆర్ మాటల్లో రాజకీయ నిరాశ,అసహనం ప్రతిధ్వనిస్తుంది -- ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆసాంతం బహిరంగమే -- రైతుల్లో గందరగోళం సృష్టించే కుట్రలో భాగమే --రాజకీయాల ప్రయోజనం కోసం రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారు --కొనుగోలు కేంద్రాలలో అవినీతికి పాల్పడి అక్రమాలు చేసిన బిఆర్ ఎస్ నేతలే

 

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: రైతుల పేరుతో బి.ఆర్.ఎస్ నేతలు ఆడు తున్నా డ్రా మాకు పరాకాష్టకు చేరిం దని ఆ పార్టీ నేత కేటీఆర్ చేసిన ప్ర కటననే ఇందుకు అద్దం పడుతోం దని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉ త్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుప డ్డారు. నిజానిజాలు తెలుసుకో కుండా శవ రాజకీయలు చేయడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మా రిందని ఆయన మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి రైతులను రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టింది చా లక అకస్మాత్తుగా రైతుల మీద ప్రేమ పొంగిపొర్లడం హాస్యా స్పదంగా ఉందని ఆయన విమర్శించారు. శుక్రవారం బి.ఆ ర్.ఎస్ నేత కే. టి. రామారావు ధాన్యం కొనుగోళ్ల మీద చేసి న ప్రకటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందిం చారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

బి.ఆర్.ఎస్ నేతలకు రైతుల స మస్యలపై ఆందోళన కంటే వారిలో రాజకీయ నిరాశ,అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోం దని ఆయన ఎద్దే వా చేశారు.అందులో భాగంగానే వాస్తవా లను వక్రీకరించి మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా ప్రవర్తిస్తున్నారని ఆయన దుయ్య బట్టారు. ధాన్యం కొనుగో ళ్ల పై ఆయన చేస్తున్న అనుచితమైన ఆరోపణలు ఇందుకు నిదర్శన మని ఆయన పేర్కొన్నారు. రైతాంగంలో గందర గోళం సృష్టించి అపో హలు కల్పించి రాజకీయ ప్రయోజ నం పొందలన్నదే బి.ఆర్.ఎస్ నేత కేటీఆర్ ముఖ్యద్దేశం గా కని పి స్తోందన్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రా ష్ట్ర ప్రభుత్వం పారదర్శకం గా వ్యవహారిస్తుందని ఏ విషయాన్ని దాచి పెట్టకుండా ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తున్నామని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుండి కొనుగోళ్ల ప్రక్రి య వరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తున్న పుడు ఇక అనుమానాలకు ఆస్కారం ఎక్కడిదని ఆయన కేటీఆర్ ను నిలదీశారు. బి.ఆర్.ఎస్ పాలనలో నాటి పాల కులు కొనుగోలు కేంద్రాలలో అవినీతికి పాల్పడి అక్రమాలు చేయడమే కాకుండా మిల్లర్లతో కుమ్మక్కై రైతాంగాన్ని నిలు వు దోపిడీకి పాల్పడ్డ బి.ఆర్.ఎస్ నేతలు ధాన్యం కొనుగోళ్ల పై మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.

దీనికి తోడు రైతుల మరణాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని ఎవరి మ రణమైనా ప్రభుత్వానికి భాదకరమేనని అయితే వాస్తవాలు నిర్దారించుకొకుండా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించేం దుకే బి.ఆర్.ఎస్ ఈ ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శిం చారు.రైతుల మరణాలను బి.ఆర్.ఎస్ నేతలు రాజకీయ ప్ర యోజనాల కోసం మార్చుకోవడం దారుణంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ధాన్యంకొనుగోళ్ల విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ 2021-22 రబీ సీజన్ నుండి ప్రస్తుత రబీ సీజన్ వరకు గణాంకాలతో సహా వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021-22 రబీ సీజన్లో నాటి ప్రభుత్వం సరిగ్గా ఈ రోజుకు అంటే 22 మే నాటికి 5,239 కోట్ల విలువ చేసే 26.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే చెల్లిం చిన మొత్తం 2,624 కొట్లు అని,అదే విదంగా 2022-23 రబీ లో 7,530 కోట్ల విలువైన 36.63 లక్షల మెట్రిక్ టన్నుల దా న్యం కొనుగోలు చేస్తే అదే మే,22 అంటే ఈ రోజుకు చెల్లిం పులు జరిగింది 3,160 కోట్లని ఆయన వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా 2023-24 రబీ సీజన్ లో సరిగ్గా ఈ రోజుకు 8691 కోట్ల విలువైన 39.51 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి 6112 కోట్లు చెల్లిం చామన్నారు. అదే విదంగా 2024-25 రబీ సీజన్లో ఇదే మే, 22 నాటికి 14,010 కోట్ల విలువైన 60.44 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి 10,882 కోట్లు చెల్లించా మని,ప్రస్తుత రబీ సీజన్ లో అదే మే 22 రోజుకు 11499 కోట్ల విలువైన48.21 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొను గోలు చేసి 8,203 కోట్లు చెల్లించినట్లు మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి గణాంకాలతో సహా బి.ఆర్.ఎస్ పాలనలో రెండు రబీ సీజన్లతో పోలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక వరుసగా మూడు రబీ సీజన్లలో దాన్యం కొనుగోళ్ల ప్ర క్రియను చెల్లింపుల మొత్తాన్ని సోదాహరణంగా వివరించా రు.

దాన్యం కొనుగోళ్ల ప్రక్రియను గణాంకాలతో పబ్లిక్ డొమిని యన్ లో పెడుతున్నప్పుడు వాస్తవాలను కేటిఆర్ వక్రీకరిం చి చెబుతున్నారు అనడానికి పై గణాంకాలు తేల్చిచెబుతు న్నప్పుడు ఇక అనుమానాలకు అపోహలకు ఆస్కారం ఎక్క డిదని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. గన్నీ బ్యా గుల అంశాన్ని ప్రస్తావిస్తూ గన్నీ బ్యాగుల అంశంలో కేటీఆర్ కు అసలు అవగాహననే లేదని తనకు తాను గన్నీ బ్యాగుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి తన అవగాహన రాహిత్యా న్ని చాటుకున్నారని ఆయన విమర్శించారు.

32 జిల్లాలకు కలిపి రబీ సీజన్ కు గాను రాష్ట్ర ప్రభుత్వం 11,29,72,831 కోట్ల కొత్త గన్నీ బ్యాగులు కొనుగోలు చేసిం దని ఇప్పటికే మిల్లర్ల దగ్గర 59,36,0824 కొట్లు అందుబా టులో ఉండగా ఏజెన్సీ నుండి తెప్పించిన 36,30,0000 కోట్లతో కలిపి 20,86,33,655 కోట్లు అందుబాటులో ఉన్నా యన్నారు. వీటిలో కొనుగోలు కేంద్రాలకు 14,12,34,297 కోట్లు సరఫరా చేయగా వాటిలో ఇప్పటికే 11,03,17,404 కోట్లు వినియోగించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివ రించారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో 30,91,6893 లక్ష లు అందుబాటులో ఉండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపడానికి వీలుగా 32 జిల్లా కేంద్రాలలో 67,39,9358 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచమన్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే గన్నీ బ్యాగులు అందుబాటులో లే వు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నిస్తూ కేటీఆర్ చేసే వ్యా ఖ్యాలు ముమ్మాటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న ది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అవగతం అబుతున్నదని ఆ యన పేర్కొన్నారు. దానికి తోడు కొనుగోలు చేసిన ధాన్యా న్ని తరలించేందుకు వీలుగా 1300 వాహనాలను వినియోగి స్తున్నామన్నారు.ఇది రైతుపక్షపాత ప్రభుత్వం అని రైతాంగా నికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని ఇందులో ఎ టువంటి అపోహలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.

దాన్యం కొనుగోలులో దిగుబడి లో యావత్ భారతదేశంలో నే తెలంగాణా రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపిన ఘనత ముమ్మాటికీ కాంగ్రేస్ ప్రభుత్వానిదే నని ఇది తట్టుకోలేక కేటీ ఆర్ నీతిమాలిన ప్రచారానికి దిగుతున్నారని ఆయన దు య్యబట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నది చైతన్యవంతమైన తెలంగా ణా రైతాంగానికి బహు బాగా తెలుసునని మీరు జరిపే శవ రాజకీయలు ,అసత్యపు ప్రచారాలు నమ్మే అంతటి అమా యకులు తెలంగాణా సమాజంలో ఎవరూ లేరన్నారు. రైతు లను అయోమయంలోకి నెట్టి ఆడుతున్న రాజకీయ నాటకా లకు ఇక ముగింపు పలకాలని ఆయన హితవు పలికారు. తప్పదోవ పట్టిస్తే ఆ దోవలో నడవడానికి ఇక్కడ ఎవరూ సి ద్ధంగా లేరని ఆయన అన్నారు.తెలంగాణా సమాజం కాం గ్రె స్ పార్టీ ఆధ్వర్యంలోనీ ప్రజాపాలనకు బ్రహ్మరధం పడుతుం టే చూసి తట్టుకోలేక నిందారోపణనలకు దిగుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Related Articles

Back to top button