MinisterD.SridharBabu : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్ర పంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైద రాబాద్ ‘ఎ మర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారు తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో లెక్స్ విట్ నెస్(Lex Witness) ఆధ్వర్యంలో నిర్వ హించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025 – హైదరాబాద్ ఎడిషన్’ ము గింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఒక న్యాయవాదిగానే నా ప్రస్థానం మొదలయ్యింది. ఆ త ర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజ కీయాల్లోకి వచ్చాను. అప్పటికీ, ఇ ప్పటికీ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా టె క్నాలజీ వినియోగం గణనీయం గా పెరిగింది. ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టు రూ మ్ లు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ లాంటివి అందు బాటు లోకొచ్చాయని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరిం చారు.
న్యాయవాదులు కేవలం కోర్టు అధి కారులు మాత్రమే కాదని, సమా నత్వాన్ని అందించే వాస్తు శిల్పులు, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసా దించిన హక్కులకు సంరక్షులని కొనియాడారు. ‘ఇప్పుడు న్యా య వాదులు అంటే కేవలం న్యాయ నిపుణులు మాత్రమే కాదు. బిజి నెస్ ఎనేబులర్లు, కాంప్లియెన్స్ నావిగేటర్లు, టెక్ ఇంటిగ్రెటేడ్ అడ్వై జర్లు.
అడ్మినిస్ట్రేషన్ పరంగా న్యాయపర మైన కార్యకలాపాల కోసం 63 శా తం పెద్ద భారతీయ కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ పైనే ఆధా రప డుతు న్నాయని నాస్కామ్ లీగల్ టెక్ రి పోర్ట్ – 2025 స్పష్టం చే స్తోంది. హై దరాబాద్ లో 120కి పైగా స్టార్టప్ కంపెనీలు ఈ-డిస్కవ రీ, డిస్ప్యూట్ అనలిటిక్, వర్చువల్ ఐపీఆర్ ప్లాట్ ఫామ్స్ తదితర రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయన్నారు.
5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు… దేశంలోని వివిధ న్యాయస్థా నాల్లో 5.15 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గతేడాది డి సెంబర్ లో కేంద్రం ప్రకటించింది. వీ టిలో కేవలం జిల్లా న్యాయస్థానా ల్లోనే 4.56 కోట్ల కేసులు అపరిష్కృ తంగా ఉన్నాయి. తెలంగాణ లోనూ 10 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చే స్తున్నాయి. ఆలస్యమైన న్యాయం నిరాకరించబడిన న్యా యంతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు... ‘న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు. సమాజం పట్ల ఒక బా ధ్యతగా భావించాలి. చట్టాన్ని తెలుసుకో వడమే కాదు, మార్పులకు అను గుణంగా సంక్లిష్ట సమస్యలను పరి ష్కరించే నేర్పును అలవ ర్చుకోవాలి. నిజమైన క్లయింట్ కేవలం మి మ్మల్ని నియమించు కు న్న వ్యక్తి లేదా సంస్థ మాత్రమే కాదు. మీపై ఆధారపడిన వ్యవస్థ అ ని కూడా గుర్తించాలి.
రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అం దరికీ అందించేందుకు కృషి చేయాలి. ఎల్లప్పుడూ న్యా యం పక్షానే ఉండాలని యువ న్యాయవాదులకు సూచించారు.కార్యక్రమంలో లెక్స్ విట్ నెస్ ప్రతి నిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు కంపెనీల లీ గల్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.