MinisterKomatiReddyVenkatReddy : మంత్రి కోమటిరెడ్డి ఆదేశం, ఆర్అండ్ బి ప్రతీఅధికారి క్షేత్రస్థాయిలో అలెర్ట్ గా ఉండాలి
MinisterKomatiReddyVenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అధికవర్షాల నేపథ్యం లో ఆర్అండ్ బి అధికారులు అప్ర మత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జా రీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్ర తి ఇంజనీర్ అలెర్ట్ గా ఉండాలనీ మం త్రి స్పష్టం చేశారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో వాహనాల రాక పోకలు పెరిగాయని, సెలవుల్లో వి ద్యార్థులు ఇళ్లకు చేరుకుంటు న్నారని సరదా కోసం రోడ్ల పైకి వచ్చి ప్రా ణాల మీదకి తెచ్చుకునే కొంత మంది యువత పట్ల అత్యంత జాగ్రత్త గా ఉండాలని అధికా రులతో అన్నారు.
అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కల్వర్టులు పొంగిపొర్లుతున్న నేప థ్యంలో వాహనాల దారి మళ్లింపు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ప్రజా రవాణాను అను మతించొద్దని స్పష్టం చేశారు. వరద ప్రవాహం ఉన్న రోడ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలనీ, కోతకు గురైన రోడ్లను ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా వెంటనే తాత్కా లిక పునరుద్ధరణ చేయాలనీ మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎల క్ట్రిసిటీ, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమ న్వయం చేసుకోవాలన్న మంత్రి, పోలీస్ యంత్రాంగం సమ న్వయం తో హెచ్చరిక బోర్డులు ఏ ర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారు లకు మంత్రి ప్రత్యేకంగా సూచన చేశారు.
అదే సందర్భంలో నార్కట్ పల్లి, అ ద్దంకి రహదారి పనుల పురోగతి పై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల ల క్ష్మారెడ్డి తో కలిసి మంత్రి శుక్ర వారం సమీక్ష నిర్వహించారు. నంది పహా డ్ క్రాస్ రోడ్ వెహికిల్ అండర్ పాస్ నిర్మాణం పై ఆర్ అండ్ బి చీఫ్ ఇం జనీర్ రాజేశ్వర్ రెడ్డి తో చర్చించా రు.యాక్సిడెంట్ స్పాట్స్ లేని రోడ్డు గా నిర్మి స్తు న్నామని నంది పహాడ్ క్రాస్ రోడ్ వెహికిల్ అండర్ పాస్ నిర్మాణా న్ని వేగం చేయాలని అన్నా రు. పనులకు ఇబ్బందిగా ఉన్న అ క్కడి ఎలక్ట్రికల్ పోల్స్ తొలగింపు, మిషన్ భగీరథ పైపు లైన్ మార్పు వా టిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఆయా శాఖల అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఇతర ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదే శించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎన్ఎఎం ప్రాజెక్ట్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ హరికిష న్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.సీహెచ్ భగ వాన్ రాజ్, డిప్యూ టీ ప్రాజెక్ట్ హెడ్ టి.ప్రసాద్ తదితరులు పాల్గొ న్నారు.