Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterKomatiReddyVenkatReddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, ప్రజల దీర్ఘాయుష్షు కోసం అందించే సేవలువెలకట్టలేనివి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, ప్రజల దీర్ఘాయుష్షు కోసం అందించే సేవలు వెలకట్టలేనివి

MinisterKomatiReddyVenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో ముఖ్యంగా ఫార్మసీ వృత్తి అనేది హ్యు మానిటీకి,పరిశోధన, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వార ధిగా పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నా రు.డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తారు, ట్రీట్ మెంట్ లో ఇచ్చే మెడిసిన్ పేషంట్ ను క్యూర్ చేస్తుందని, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, దేనికి పనిచే స్తుంది,ఎంత మోతాదు అనే పరిశో ధన చేసేది మీరే కదా అంటూ కీలక వ్యాఖ్య చేశారు. ప్రజల ఆరోగ్యం, భద్రత, వారి దీర్ఘాయుష్షు కోసం మీ రు అందించే సేవలు వెలకట్ట లేనివని, సమాజం కోసం మీ మేధస్సును దారపోస్తారని కితాబు నిచ్చారు.

శనివారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని (1 974-2025) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేష న్స్ (kakatiya univers ity fharmaallumini golden jubilee celebrations) కార్యక్రమంలో పాల్గొన్న రా ష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంక ట్ రెడ్డి రాష్ట్ర ఐ టీ,పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు, కాకతీ య యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ ఫెసర్ కె. ప్రతాప్ రెడ్డిల తో కలిసి పాల్గొని ప్రసంగించారు. కాకతీ య యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హా జరు కావడం ఎంతో సంతో షంగా ఉంద న్నారు.

నాతో పాటు ముఖ్య అతిథిగా వి చ్చేసిన ఐటీ, ఇండస్ట్రీస్ డైనమిక్ మినిస్టర్ శ్రీధర్ బాబుకి, K.U వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డికి,ఇతర అతిథులకు, యూనివ ర్సిటీ ఫ్యాకల్టీ, పూర్వ విద్యార్థు లు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన వి ద్యార్థులందరికీ నా హృదయ పూర్వ క శుభాకాంక్షలు, నమస్కారం అం టూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫా ర్మాస్యూటికల్ సైన్సెస్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ని ర్వహుకులు ఈ విశిష్ట సదస్సును నిర్వహించడం చాలా గొప్ప వి ష యమని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహి స్తున్న KU ఫార్మా అల్యూమ్ని అసోసియేషన్ సభ్యులకు నా హృద యపూర్వక అభినందనలు తెలిపారు.

పూర్వ విద్యార్థులు అంతా తిరిగి ఒక వేదికను ఏర్పరచుకుని సమా జానికి వారిందిస్తున్న సేవలు గుర్తు చే సుకోవడం, భవిష్యత్ తరాల కు మార్గ నిర్దేశనం చేయడం విలువల తో కూడిన విద్యకు నిదర్శ. నంగా చెప్పుకోవచ్చు.నల్గొండ జిల్లా సంకిశా ల ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారె డ్డి 35 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉ న్నారు. ఆయన న్యూ యార్క్ లో బ్యాక్టోలాక్ ఫార్మాస్యూటికల్,పలు కంపెనీలకు చై ర్మన్ గా ఉన్నారు. ఆ యన మార్కెట్ నెట్ వర్త్ సుమారు 10వేల కోట్లు అని గుర్తుచేశారు.


గ్రామీణ ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి గారి లాంటి వారిని నేటి ఫార్మా విద్యార్థులు స్పూర్తిగా తీసు కోవాలి.విద్య అనేది మనలో వె లుగు నింపుతుంది, తరతరాలకు ప్రేరణ ఇస్తుందన్నారు.ఇట్లాంటి సంస్థలు తెలంగాణ నే కా దు యావత్ భారతదేశాన్ని అభివృ ద్ధిలో, నూతన ఆవిష్కరణలో, స మాజ సేవ మార్గంలో నంబర్ వన్ గా నిలిపే మూల స్తంభాలుగా ఉం టాయనడంలో ఎలాంటి అతిశయో క్తి లేదన్నారు. గత అయిదు దశా బ్దాలుగా యూ సి పిఎస్సి ఔషధ వి ద్య, పరిశోధన మరియు సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలిచిందన్నా రు.

విద్యార్థుల్లో మేధస్సు తో పాటు నైతిక విలువలను పెం పొందించ డం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న అకాడమిక్, ఇండస్ట్రీ, నియం త్ర ణ సంస్థలలో నాయకులుగా ఎదిగే లా చేసిందన్నారు. ఇక్కడి పూర్వ విద్యార్థులు పరిశ్రమలలో, పరిశో ధనలో, నియంత్రణ సం స్థల లో చే సిన కృషి ఈ సంస్థ యొక్క దూర దృష్టి మరియు సమ గ్రవిద్యను ప్రతి బింబిస్తుందని చెప్పారు.

విద్యార్థుల సంక్షేమం, మౌలిక స దు పాయాల అభివృద్ధి కోసం అ ల్యూ మ్నీ అందిస్తున్న సహకారం వారికి ఉన్న దాతృత్వ మనసుకు నిద ర్శనమన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సె లబ్రేషన్స్ గత విజయాల జ్ఞాపకాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆ విష్కరణలకు, సహ కారానికి ప్రేరణ గా నిలవాలని కోరుకుంటున్నాను.

ఫార్మా రంగం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అనేక చర్యలు చేపడు తుందని వివరించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉ న్నపుడు ORR నిర్మించామని, శం షాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించామని, అది అనేక పరిశ్రమలు వచ్చేందుకు కీలక భూమిక పోషించిందని వెల్ల డించారు.

ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మించబోతున్నాం..ORR నుండి RRR కు రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇది పారిశ్రా మిక వృద్ధికి దోహద పడుతుంది. తెలంగాణను అగ్రగామిగా నిలి పేందుకు మా క్యా బినెట్ అంతా కలసి అన్ని రకాల చర్యలు చేప డుతున్నామని, ఐటీ, ఫార్మా హబ్ గా తెలంగాణను తీర్చి దిద్దు తా మని పునరుద్ఘాటించారు.

ఇక్కడికి వచ్చిన ఫార్మా ప్రముఖు లు, ఫ్రొఫెసర్స్ అందరూ మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని, భగవంతుడు వారికి మరింత శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుం టున్నానని ఆకాక్షించారు. కాకతీ య విశ్వవిద్యాలయం నుండి మ రింత ఉన్నత శిఖరాలను అధిరో హించి, విద్య, పరిశోధనల ద్వారా రాష్ట్రం మరియు దేశానికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు.