Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:43 pm Posted by : praja deveena

ministers hot comments on 22A lands : బిగ్ బ్రేకింగ్, 22A జాబితాపై రాజకీయరగడపై మంత్రుల కీలకప్రకటన, కుట్రకోణంపై విచారణకు సిద్ధం

ministers hot comments on 22A lands : ప్రజా దీవె న, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో 22 A నిషేధిత భూముల జాబి తా మరో సారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రజల్లో నెలకొన్న ఆందోళ నలను తగ్గిం చే ప్రయ త్నంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుండగా, మరో వైపు ఈ వ్యవహా రంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మా టల యుద్ధం మ రింత ముదురుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్ర కటన చేస్తూ, 22A జాబితా కారణంగా ఇ బ్బందులు ఎదుర్కొన్న భూయజ మా నులకు ఊరటని చ్చా రు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఆన్‌లైన్ అప్‌లోడిం గ్‌లో కొన్ని సాంకేతిక లోపాలు చోటు చే సుకున్నాయని, వా టిని ప్రభుత్వం బహిరంగంగా అంగీకరిం చి సరిదిద్దే ప్రక్రియ ప్రారంభించిందన్నారు.దీని ఫలితంగానే కేవలం 24 గం ట ల్లో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా లో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజి స్ట్రేషన్లు పూర్తయ్యాయని వెల్ల డిం చారు. ప్రజలు ఎ లాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, న్యాయబద్ధ మై న ప్రైవేట్ ఆస్తులన్నింటికీ పూర్తి రక్షణ కల్పి స్తామని హామీ ఇచ్చా రు.

రోజు వారీగా దరఖాస్తుల పరిశీలన

22A సమస్యల పరిష్కారం కో సం ప్రత్యేక కమిటీని ఏర్పా టు చేసిన ప్రభుత్వం, వచ్చే 15 రోజుల పాటు ప్రతిరోజూ ద రఖాస్తులను పరిశీలించి అర్హమైన భూములను వెంటనే క్లి యర్ చేయాలని ని ర్ణయించింది. రెవెన్యూ శాఖ ఉ న్నతాధి కారులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షించనున్నారు.

  హరీశ్ రావుకు పొంగులేటి సవాల్

22A వ్యవహారంలో డబ్బులు వ సూలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోప ణలపై మంత్రి పొం గులేటి ఘాటుగా స్పందించారు. “మేము తప్పు జరిగిందని ఒప్పుకున్నాం.. దాన్ని సరిదిద్దుతున్నాం కూడా. కానీ ధ రణి పేరుతో గత ప్రభుత్వం చేసి న తప్పులకు ఎప్పుడైనా బాధ్య త తీసుకున్నారా?” అంటూ ప్రశ్నించారు.పేదల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, రాజకీయ లబ్ధి కోసం ప్ర జలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని స్ప ష్టం చేశారు.

    మరో బాంబ్ పేల్చిన కోమటిరెడ్డి

ఇక నల్లగొండలో మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. 22A జా బితా వెనుక కుట్ర కోణం ఉండొచ్చ ని, కొందరు అధికారులు ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడా నికి ప్రయ త్నించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు .”పొరపాటున జరి గిందా? లేక కావాలనే చేశారా? అన్నది సమగ్ర విచారణలో తేలుతుంది. బాధ్యులు ఎవరైనా వది లిపెట్టం” అంటూ హెచ్చరించారు.22A జాబితాలో భూము లు చేరి న బాధితులు ఎలాంటి మధ్యవ ర్తులను ఆశ్రయించ వద్దని, దర ఖాస్తుల కోసం డబ్బులు చెల్లిం చాల్సిన అవస రం లేదని కోమ టిరెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

        శ్వేతపత్రానికి రంగం సిద్ధం

యాదగిరిగుట్ట పరిసరాల్లో 42 వే ల ఎకరాలు నిషేధిత జా బితాలో చేరిన అంశాన్ని తాను నాలుగు నెలల క్రితమే ము ఖ్యమంత్రి దృ ష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వె ల్లడించారు. సీఎం అమెరికా ప ర్యటన ముగిసిన తర్వాత 22A అంశంపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం తప్పును అంగీకరించి పరిష్కార చర్యలు చేప డుతుండగా, మరోవైపు కుట్ర కోణం, అ ధికారుల పాత్ర, కమి షన్ల ఆరోప ణలు రాజకీయంగా మరింత వేడె క్కిస్తున్నాయి. విచారణలో ఎ లాంటి నిజాలు బయటపడతా యన్నది ఇ ప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర అంశం గా మారింది.