Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 9:22 am Posted by : praja deveena

Ministers surprise visit paddy centers : బిగ్ బ్రేకింగ్, మంత్రుల మూకుమ్మడి కీలక ఆదేశం, యుద్ధప్రాతిపదికన ధాన్యంకొనుగోళ్లు చేయాల్సిం దే

Ministers surprise visit paddy centers :  ప్రజా దీవె న, నల్లగొండ: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండిన ధాన్యపు రాశులను తుది దశకు చేర్చేందుకు ప్రభుత్వం మరింత వేగం పెంచిన ట్లు సంకేతాలు అందుతున్నాయి. గురువారం నల్ల గొండ కనగల్ మం డలం జిల్లా చెట్ల చెన్నారం ధాన్యం కొను గోలు కేంద్రాన్ని మంత్రులు కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కు మార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ లు సంయుక్తంగా సందర్శించా రు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రులు, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. “వచ్చిన ధా న్యం ఎంత? మిల్లులకు పంపింది ఎంత? మిగిలినది ఎప్పుడు కొంటారు?” అంటూ లెక్కలతో సహా ముగ్గురు మంత్రులు ముక్తకంఠంతో ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సేకరించిన ధాన్యానికి మి ల్లులకు చేర్చే క్రమంలో ఎక్కడా ఆలస్యం జరగకూడదని వెం టనే లారీల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆదేశించారు.

     పక్కా పది రోజుల లక్ష్యం నిర్దేశన

ముఖ్యమంత్రితో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నిర్ణ యాల మే రకు, మరో 10 రోజుల్లో జిల్లా వ్యా ప్తంగా కొను గోలు ప్రక్రియను క్లోజ్ చేయాలని పునరుద్ఘాటించారు. ధా న్యం ఇచ్చిన వెంటనే రైతు ఖా తాల్లోకి నిధులు చేరేలా బ్యాంకింగ్ వ్యవస్థను అప్రమత్తం చేయాలన్నారు.పరిశీలన అనంతరం మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణను ఎగతాళి చేసిన వాళ్ళు, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసు కుంటారని చులకనగా మాట్లాడిన వాళ్ళు ఇ వాళ పారుతు న్న సాగు నీరు, పండుతున్న బంగారు పంట ను చూడాలి. వ రి ఉత్పత్తిలో తెలంగాణ ఇవాళ దేశంలోనే నెం బర్ వన్ స్థా నానికి చేరిందంటే అది కాం గ్రెస్ కట్టిన సా గర్, శ్రీశైలం, శ్రీరా మ్ సాగర్ ప్రాజెక్టుల పుణ్యమేనని వ్యా ఖ్యానించారు.

     హమాలీ సమస్య పరిష్కారం

ధాన్యం ఎగుమతి, దిగుమతి వి ష యంలో కార్మికుల కొర త ను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వె ల్లడించారు. త్వరలోనే ఎస్.ఎల్.బి.సి (SLBC) సొరంగం పూర్తి చేసి, మరింత బీడు భూములను పచ్చగా మారు స్తా మని హామీ ఇచ్చారు.రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నై తిక హక్కు విమర్శకులకు లేదని, ఆత్మ విమర్శ చేసుకోవా లని హితవు పలికారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకు మా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగో లు చేస్తుంది. రైతు రాజ్యం తేవడమే మా లక్ష్యం.” అని మం త్రులు స్పష్టం చేశారు.