Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 12:41 pm Posted by : praja deveena

Miryalaguda MinisterUttamKumarReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రిఉత్తమ్ కీలకప్రకటన, మిర్యాలగూడ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ కీలక ప్ర కటన,మిర్యాలగూడ సమగ్రాభి వృ ద్ధికి కట్టుబడి ఉన్నాం

Miryalaguda MinisterUttamKumarReddy: ప్రజా దీ వెన, మిర్యాలగూడ:మిర్యాలగూడ నియోజకవర్గ సమ గ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అ య న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రె డ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుం దూరు రఘువీర్ రెడ్డితో కలిసి మి ర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూ పాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు.

శెట్టిపాలెం నుండి అవంతి పురం వరకు 74 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల రూపాయల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చే పట్టిన రోడ్డు , 16 కోట్ల రూపాయల టిఎఫ్యుఐడిసి నిధులతో చేపట్టి న సిసి రోడ్డు ,మురికి కాలువలను ప్రారంభించారు.

మిర్యాలగూడ ము న్సిపాలిటీ పరిధిలో41 కోట్ల రూపా యల బీటీ, సీసీ రోడ్డు పనులను, 15 కోట్ల రూపాయల వ్యయం తో మిర్యా లగూడ నుండి తడకమళ్ళ వరకు ఉన్న డబుల్ రోడ్డు ను 6 లై న్లుగా మార్చే పనులకు, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓ వర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరి యా, మున్సిపాలిటీ ఆఫీసు ఏరి యా సుందరీకరణ పనులకు శంకు స్థాపన చేశారు. 5 కోట్ల రూపా యల వ్యయంతో కేఎన్ఎమ్ డిగ్రీ కళా శాలలో నిర్మించిన అదనపు భవనా న్ని , అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 2.25 కోట్ల రూపాయ లతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారం భించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స మావేశాలలో రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ
నియోజకవర్గంలో సాగునీరు అం దించే ఆయకట్టు లో ఎక్కడా స మస్యలు లేకుండా నీరిస్తామని, అలా గే మొదలుపెట్టిన అన్ని ఎత్తి పోతల పథకాలను నూటికి నూరుశాతం పూర్తి చేస్తామని, మిర్యాల గూడ అ భివృద్ధికి పాటుపడతామని తెలిపారు .రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తామందరము కట్టుబడి ఉన్నామని అ న్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలం గా ణలో ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబి య్యాన్ని ఇస్తున్నామని, గత ప్రభు త్వం పది సంవత్సరాల లో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని,తాము అ ర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తు న్నామని, ఇంకా ఎవరైనా మిగిలిపో యి ఉంటే వారికి కూడా రేషన్ కార్డు లు ఇస్తామని, ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, ప్రతి వరి రైతుకు న్యాయం చేస్తామ న్నారు.

ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల లో 72 గంటల్లో నిధులు జమ చేస్తు న్నామని, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించా మని, స మాజంలో అన్ని వర్గాల మేలు కో సం ప్రభుత్వం కృషి చే స్తున్నదని ఎ స్సీ వర్గీకరణ పూర్తి చేశామని, 42 శాతం బీసీ రిజ ర్వే షన్లు ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని, సామాజిక న్యా యం సంకల్పంతో ముందుకెళ్తున్నామని, ఏవైనా సమస్యలుంటే త మ దృష్టికి తీసుకు రావాలని కోరారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో మెయిన్ కెనాల్ లైనింగ్ కి 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రక టించారు. అంతేకాక నియోజక వ ర్గంలోని దుబ్బతండ, శాంతినగర్, రావుల పెంట చెక్ డాంల నిర్మాణా నికి 24 కోట్ల రూపాయలను, ఫీడర్ చా నళ్ల నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలను మంజూరు చే స్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణం లో ఉన్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లను త్వర లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో 250 కోట్ల రూపా యలతో హ్యం రోడ్లు మంజూరు చే యడం జరిగిందని, ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామ ని, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 450 కో ట్లు, దేవరకొండ ని యోజకవర్గానికి 350 కోట్లతో హ్యాం రోడ్లకు టెండర్లు పిలవనున్నా మని, రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ చరి త్రలో ఎప్పుడు లేని విధం గా ఆర్అండ్ బి రహదారులు చేపడుతు న్నామని తెలిపారు.

రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు. హైదరాబాద్- విజయవాడ రహదారిని 10,500 కోట్లతో చేపట్టనున్నామని, హైదరాబాద్- చిట్యాల రోడ్డు 7600 కోట్లతో చేపట్టనున్నామన్నారు. నల్గొండ జి ల్లాను అన్ని రం గాలలో అభివృద్ధి చే స్తామని తెలిపారు.

స్థానిక శాసనసభ్యులు బత్తుల ల క్ష్మారెడ్డి మాట్లాడుతూ 250 కోట్ల రూపాయలతో హ్యాం రోడ్లను మం జూరు చేసినందుకు కృతజ్ఞతలు తె లిపారు. నీటిపారుదల కింద చేపట్టి న పనులన్ని పురగతిలో ఉన్నాయ ని ,నియోజకవర్గ అభివృద్ధికి మం త్రులు పూర్తి సహకా రం అందించా లని కోరారు.నల్గొండ పార్లమెంట్ స భ్యులు కుందూ రు రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వెంక టేశ్వరరావు మాట్లాడారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమి త్, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వ ర్లు, ఆర్ అండ్ బి ఎగ్జి క్యూటివ్ ఇం జనీర్ శ్రీధర్ రెడ్డి తదితరులు మంత్రుల వెంట ఉన్నా రు. కాగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శ రత్ చంద్ర పవార్ హెలిప్యాడ్ వద్ద మంత్రులకు పుష్పగుచ్ఛాలు అంద జేసి ఘన స్వా గతం పలికారు.ఈ కార్యక్రమాలలో అదనపు ఎస్పి రమేష్ డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్ర తినిధులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసో సియేషన్ తరపున అ ధ్యక్షులు శ్రీనివాస్ ఆసుపత్రిలో ఫ్రీ జర్ బాక్స్ ఏర్పాటు కోసం 25 లక్షల రూపాయల చెక్కును మంత్రులకు అందజేశారు.