Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 3:57 am Posted by : praja deveena

Miryalaguda road accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో విషాదం, ఘోరప్రమాదంలో పురోహితుడు దుర్మరణం 

 

Miryalaguda road accident : ప్రజా దీవెన, మిర్యాల గూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని రాంనగర్ బంధం సమీపంలో ఆదివారం విషాదకర సంఘ టన చోటుచేసుకుంది. వేగంగా దూసు కొ చ్చిన లారీ ఒక బై క్‌ను ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమా దంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువ పురో హితుడు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతి చెందిన యువకుడు పాలకవీడు మండల కేంద్రానికి చెందిన కందాల విజయమ్మ కుమారుడు హరికృష్ణగా గు ర్తించారు. అతను అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి పెద్ద కు మారుడిగా కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. ఈ సంఘ టనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘ టన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నా రు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.