Opinionక్రైంనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Miryalaguda terrible fire accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర కలియుగం, నిద్రలోనే ముగ్గురు సజీవదహనం

Miryalaguda terrible fire accident  ప్రజా దీవెన, మి ర్యాలగూడ: అది అర్ధరాత్రి సమయం.. అందరూ గాఢ నిద్ర లో ఉన్నారు. అంతలోనే ఊ హించని ప్రమాదం ముంచుకొ చ్చిం ది. క్షణాల వ్యవధిలో రేకుల ఇల్లు మంటల్లో చిక్కుకుం ది. కాపాడా లంటూ ఆ ముగ్గురి ఆర్తనాదాలు చేసేలోపే గ్యా స్ సిలిండర్ ఒక్కసా రిగా బద్ధలైంది. ఆ పేలుడు ధాటికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు అక్కడికక్కడే సజీవదహన మయ్యారు.

ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.ప్రాథమిక స మాచారం ప్రకారం.. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఒ క్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమా దంలో వనం చంద్రకళ (45), లక్ష్మ ణ్ (16), ప్రణతి (14) లు ఆ మంటల్లో చిక్కుకొని కాలిబూడిదయ్యారు.

    మృత్యుపాశంగా సిలిండర్

మంటలు అంటుకున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించా రు. కానీ, దు రదృష్టవశాత్తూ అదే సమయంలో ఇంట్లోని గ్యాస్ సిలిం డర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దాంతో మంటలు క్షణాల వ్య వధి లో ఇల్లంతా వ్యాపించాయి. దట్ట మైన పొగ, మంటల తీవ్రతకు బ యటకు వచ్చే దారి లేక ముగ్గురూ లోపలే చి క్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచా రంతో వెంటనే స్పందించిన ఫైర్ సి బ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చా రు.

సమాచారం అందుకున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు వెంటనే సంఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని స మీక్షించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు మృత దే హాలను స్వాధీనం చేసుకుని, పో స్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో మిర్యాలగూడ పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అ లుము కున్నాయి. ఈ మేరకు మిర్యాలగూడ పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Back to top button