Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:51 am Posted by : praja deveena

Miyapur Trogedy suicide : బిగ్ బ్రేకింగ్, మియాపూర్‌లో తీవ్రవిషాదం, ఆరునెలల పాపతో బిల్డింగ్ పైనుండి దూకినతల్లి

Miyapur Trogedy suicide ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌ మియాపూర్‌ పరిధిలోని మయూరి నగర్‌లో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు పండంటి బిడ్డ పుట్టిందన్న ఆనందం.. మరోవైపు మనసును తొలిచేస్తున్న అంతుచిక్కని నిశ్శబ్దం. చివరికి ఆ మానసిక పోరా టంలో ఓ తల్లి ఓడిపోయింది. తన ఆరునెలల కన్నపే గుతో సహా ఆరోఅంతస్తు నుంచి కిందకు దూకేసింది.

మయూరి నగర్‌లోని ఒక అపార్ట్‌ మెంట్‌లో ఈషా సాహు (3 7) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. శని వారం తెల్లవారు జామున ఆమె తన ఆరు నెలల పసి కందు ను గుండెలకు హత్తుకుని, అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుం డి కిందకు దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఈషా సాహు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పసిపాప ప్రాణాలతో కొ ట్టుమిట్టాడుతూ కనిపించింది.స్థానికులు వెంటనే స్పందించి, తీ వ్రంగా గాయపడిన ఆ చి న్నారిని చికిత్స నిమిత్తం సమీ పంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ప్రాణా ల కోసం వైద్యులు పోరాడు తున్నారు.

వెలుగులోకి తెచ్చిన ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ నీడలు

మొదట ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల ప్రా థమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వె లుగు లోకి వచ్చాయి. రెండో కాన్పు తర్వాత ఒత్తిడి ఈషా సాహు కు ఇది రెండో సంతానం. రెండో బిడ్డ పుట్టినప్పటి నుండి ఆ మె తీవ్రమైన మానసిక ఒత్తిడికి (Postpartum D epressi on) లోనై నట్లు సమాచారం.

        కనుమరుగైన చిరునవ్వు

గత కొన్ని నెలలుగా ఆమె ఎవరితో నూ సరిగ్గా మాట్లాడకుం డా, తీవ్ర మైన డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు గు ర్తించారు. ఆ మాన సిక ఆందోళనే చివరికి ఆమెను ఈ ఘోర నిర్ణయానికి ప్రేరేపించింది. ఇ దిలా ప్రసవం తర్వాత మహిళ ల్లో వచ్చే ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ (Postpartum Depre ssi on) అనేది ఒక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. దీనిని కేవలం “మూడ్ స్వింగ్స్” అని నిర్లక్ష్యం చేయకుండా, కుటుం lబ సభ్యులు సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించ డం ఎంతో అవసరం.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లి దూరమై, ఆసుపత్రి బెడ్‌పై చావుబ తుకుల మధ్య కొట్టుమిట్టాడు తు న్న ఆ ఆరు నెలల పాప పరిస్థితిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా మానసిక ఒ త్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లయితే దయచే సి వెంటనే నిపుణుల సహాయం తీసుకోండని, హెల్ప్‌లైన్ నంబ ర్లు స్నేహ (044- 2 4640050), వందే వండర్‌ఫుల్ లైవ్స్ (9 999 666 555) లలో సంప్ర దించాలని మానసిక వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.