Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:43 am Posted by : praja deveena

MLA Disqualification Verdict : బిగ్ బ్రేకింగ్, స్పీకర్ సంచలన నిర్ణ యం, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్ తిరస్కరణ 

MLA Disqualification Verdict : ప్రజా దీవెన, హైద రా బాద్: రా ష్ట్రoలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వా త నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మె ల్యేల అన ర్హ త పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సం చలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విడతల వారిగా నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్న స్పీకర్ చివ రిగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల భవితవ్యం కూడా యదా తీర్పు గా వెలువరించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై బుధవారం కీల క తీర్పు ప్రకటిస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన ఎ మ్మెల్యే అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.

స్పీకర్ నిర్ణయం తీర్పుతో రాజకీయాల్లో ట్విస్ట్ 2023 అసెం బ్లీ ఎన్నికల్లో తరఫున గెలిచిన ఈ ఇ ద్దరు ఎమ్మెల్యేల తర్వా త కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిపై పార్టీ ఫిరా యింపు చట్టం కింద చర్యలు తీసు కోవాల ని బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటి షన్ల పై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలకంగా స్పందించారు.దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుని వారు ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నారని ప్రకటించారు. పార్టీ మారినట్లు స్ప ష్టమైన ఆధారాలు లేవoటూ అనర్హత పిటిషన్లను డిస్మిస్ చే శారు. దీంతో ఈ నిర్ణయం తో ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊ రట లభించింది.

 సుప్రీంకోర్టు విచారణకు ముందు నిర్ణయం

ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుల అంశంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుం డగా ఇప్పటికే పలుమార్లు కే సును విచారించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణకు ముం దే స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని సూచించింది. ఈ నే పథ్యంలో బుధవారం తీర్పు వెలువడింది.ఇదిలా ఉండగా తీర్పుపై స్పందించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం ద ర్ స్పందిస్తూ స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా కూడా పో రాటం ఆపనని తెలిపారు.ఎంపీగా పోటీ చేయడం తన వ్య క్తిగత నిర్ణయం అని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని వెల్లడించారు. బీఆ ర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని స్ప ష్టం చేశారు.పార్టీ నుంచి ఎప్పుడూ విప్ ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చ ర్చలు వేడెక్కాయి. రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణ త ర్వాత ఈ అంశం మరింత ఆసక్తికర మలుపు తిరిగే అవ కా శం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమ యంలో రేపు సుప్రీం కోర్టులో విచారణ తీర్పుపై సర్వత్రా ఉ త్కంఠ నెలకొంది. ఏది ఏమైనా సర్వోన్నత న్యాయ స్థానం ఎ మ్మెల్యేల పార్టీ మార్పుపై ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి నెల కొంది.