Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 3:07 pm Posted by : praja deveena

MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ప్రజలకు కొత్త ఆశాకి ర ణం, ఉచిత కంటి వైద్యశిబిరంలో అత్యాధునిక మినీ మొబైల్ హాస్పి టల్ 

MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ ప్రజల ఆరో గ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో మరో ముందడుగు పడింది. ఉచి త కంటి వైద్య శిబిరాలను విజయవం తంగా నిర్వహిస్తూ వ స్తున్న కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ము నుగోడు ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడిన మినీ మొబైల్ హాస్పిట ల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తె లంగాణ రాష్ట్రం లోనే తొలిసారిగా ఇలాంటి సాంకేతికత కలి గిన ఈ మొబైల్ ఆసుపత్రిని వినియోగించడం ప్రత్యేకతగా నిలిచింది.

ఇప్పటివరకు నిర్వహించిన 12 ఉ చిత కంటి వైద్య శిబిరా ల్లో మొత్తం 9034 మంది కంటి పరీక్షలు చేయించుకోగా అం దులో 1970 మం దికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఇప్పుడు ని ర్వహిస్తున్న 13వ విడత శిబి రంలో మినీ మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించికంటి పరీక్షల తో పాటు మరిన్ని ఆధునిక వైద్య పరీక్షలను కూడా అంది స్తున్నారు.

ఈ మినీ మొబైల్ హాస్పిటల్‌లో రోగులకు వెంటనే వివిధ ర కాల వైద్య పరీక్షలు నిర్వహించే సౌకర్యం ఉంది. ముఖ్యంగా కంటి పరీక్షలు CBP (Complete Blood Picture) పరీక్ష, E CG, డిజిటల్ ఎక్స్-రే ఇతర ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్ష లు నిర్వహించారు. గత శిబిరాల్లో కం టి పరీక్షలకు వచ్చిన చాలా మంది లో ఇతర ఆరోగ్య సమస్యలు బ యటపడటం వల్ల కొందరు ఆపరే షన్లకు ఎంపిక కాకుండా తిరిగి వె ళ్ళా ల్సి వచ్చిన పరిస్థితిని ఎమ్మెల్యే గమనించారు.

ఏ ఒక్కరు చిన్న సమస్య వల్ల కూడా చికిత్స లేకుండా వె నుతిరిగి వెళ్లకూడదన్న సంకల్పంతో ఈ మినీ మొబైల్ ఆసు పత్రిని అందుబాటు లోకి తీసుకువచ్చారు.ఈ రోజుల్లో సొం త పిల్లలే పట్టించుకోని పరిస్థి తులు ఉన్నప్పటికీ మునుగో డు ప్రజలందరికీ పెద్దకొడుకులా నిలుస్తూ రాజ్ గోపాల్ రెడ్డి తన స్వంత ఖర్చులతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తు న్నారు.