MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: బడి గు డితో సమానమని ప్రతి గ్రామంలో గ్రా మస్తులందరూ కలిసి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయా ల్సిన అవసరం ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రా జగో పాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రా మం లో ప్రభుత్వ పాఠశాల వార్షికో త్స వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభు త్వ విద్యను ప్రోత్సహించడానికి తన వం తు కృషి చేస్తున్నా నన్నారు. గత వి ద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చది వి 10వ తరగతిలో ప్రధ మ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15 వే లు, 10 వేలు, 7500 రూ పాయల ప్రోత్సాహకం అందించమని, ఈ విద్యా సంవత్స రానికి ఈ ప్రోత్సాహకాన్ని పెంచుతున్నామన్నారు.
ఈసారి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానా లు సాధించిన వారికి 25 వేలు, 15 వేలు,10 వేల రూపాయ లు అందిస్తామన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య లో సమూల మార్పులు తీసు కురావాల్సిన అవసరం ఎం తైనా ఉందని, సమూల మార్పులు తీసుకురావడానికి ము ఖ్యమంత్రి రే వంత్ రెడ్డి చాలా బాగా విద్య వ్యవస్థ పైన ఫో కస్ చేస్తున్నాడన్నారు. ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో అ త్యున్నత స్థాయికి వెళ్ళినవారందరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనని, ప్రభుత్వ పాఠశాలలో చదువు గొప్పగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.
మనం మన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తామో సమా జంలో ఉన్న పేద వాళ్ళ గురించి గ్రామం గురించి ప్రాంతం గు రించి ఆలోచించినప్పు డే ప్రభుత్వ బడులు ప్రాంతం అభి వృద్ధి చెందుతాయని, మా అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌం డేషన్ పేరు మీద నేను బ్రతికున్నంత వర కు పేదలకు ఆర్థిక సహాయం చేస్తా నన్నారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసo మంత్రి వెంకటరెడ్డి వైఎ స్ఆర్ తో కోట్లాడారు
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా పనిచేసినప్పుడు కొట్లా డి మరి తీసుకొచ్చింది ఉదయ సముద్రం బ్రాహ్మణ వె ళ్లెంల ప్రాజెక్టు అ ని, 90 శాతం పూర్తయిన ఆ ప్రాజెక్టును కా వాలని 10 సంవత్స రా లు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10 శా తం పనులని పూర్తి చేసి భూసేకర ణ ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పంపులను ఓపెన్ చేశామని గుర్తు చేశారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగం గా మునుగోడు నియో జకవర్గం లో ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టు కు ఎక్కడి నుండి నీటిని తీసుకురా వాలో అనే అంశాన్ని వదిలిపెట్టి కే వలం కమిషన్ల కోసమే టిఆర్ఎస్ పార్టీ రిజర్వాయర్ లు కట్టి వదిలి పెడితే మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించడానికి 1800 కోట్ల రూ పాయలను మంజూరు చే యించానని ఆపనులు మొదల య్యాయని అన్నారు. బ్రాహ్మణవె ళ్లెంల లో ప్రాజెక్టు నుండి మునుగో డు మండలంలోని గ్రామాలకు శాశ్వతంగా సాగు నీరు తాగునీరు అం దించడానికి భూసేకరణ పనులు జ రుగుతున్నాయన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తున్న
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిస్వార్ధంగా ని జాయితీ గా పని చేస్తున్నానని, ఇటీవల కొం తమంది తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాజకీయాల్లో ఉన్న ప్పుడు రాజకీయాలు మాట్లా డుకోవాలి రాజకీయాలు లేన ప్పు డు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టా లని అన్నారు. మును గోడు నియో జకవర్గంలో స్వాతంత్రం వచ్చిన నా టి నుండి ఇప్పటివరకు 31 సబ్ స్టే షన్లు నిర్మాణం అయితే మా ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవ త్సరాలలోనే 24 సబ్ స్టే షన్లు మం జూరయ్యాయని తెలిపారు.
ప్రస్తుతానికి 132 కెవిసబ్ స్టేషన్ లు మూడు ఉండ గా మరో మూ డు 132 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేయించాన న్నా రు.రాబోయే 25, 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మునుగోడు నియోజకవర్గంలో లోవోల్టిజి సమస్య లేకుండా చూడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.

