
Mla Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు:గత పా లకుల పాలనలో ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించే స్వేచ్ఛ ఎ మ్మెల్యే, ఎంపీలకు ఉండేది కాదని, ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఏ చిన్న ప్రజాసమస్యలైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్ర తినిధులకు ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరె డ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా స్త్రీ శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ము నుగోడు నియోజకవర్గ వ్యాప్తం గా పని చేస్తున్న 357 మంది అంగన్వాడీ టీచర్లకు సూపర్వై జర్లకు మొబైల్ ఫోన్లను ఎ మ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు శాసనసభ్యు లు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో అంగన్వాడీ కేంద్రాలలో చదువు కుంటున్న చిన్నా రులకు యూని ఫార్మ్స్ ను అందజేశారు.
అంగన్వాడీ టీచర్లు సమాజంలో గురుతల బాధ్యతను ని ర్వహిస్తు న్నారని పేరుకు వాళ్లు చేసే పోస్ట్ చిన్నదైనా బాధ్య తలు మాత్రం పెద్ద వన్నారు. ఆరు సంవత్సరాల లోపు బాల బాలికలను కన్నతల్లులాగా కంటికి రెప్పలా చూసుకుం టు న్నర ని వారికి ప్రభుత్వం ఎంత చేసిన తక్కువేనన్నారు. అం గన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ము ఖ్యమం త్రిదృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం అంగ న్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహా ర స్టాల్సుని సందర్శించి సొంతంగా తయారుచేసిన పౌష్టికా హార పదార్థాలను రుచిచూశారు. ఈ కార్య క్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మండ లాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు పాల్గొ న్నారు.





