Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 10:28 am Posted by : praja deveena

Mla Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, చౌటుప్పల్ వేదికగా ‘రాజ్ గోపాల్ రెడ్డి’ సంచలన వ్యాఖ్య, రాహుల్ నాయకత్వంలోనే నాప్రయాణం

 

Mla Komatireddy rajgopalreddy :ప్రజా దీవెన, చౌటు ప్పల్: తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్.. నిలిపేది కాంగ్రెస్.. రా హుల్ గాంధీ నాయ కత్వంలో నా ప్రయాణం ఇక్కడే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచ ల న వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారా మ చంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకా రమహోత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, తె లంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృ ష్టించిన వేదికగా మారింది. గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న రాజకీయ ఊ హాగానాలకు ము నుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడి యా ముఖంగా కుండబద్దలు కొట్టే సమా ధానం ఇచ్చారు.

  కాంగ్రెస్ పార్టీ మరే ప్రసక్తే లేదు

పార్టీ మారే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాం గ్రెస్ పార్టీ సైనికుడిగానే కొనసాగుతా.”పార్టీపై విమర్శలు చే యలేదు,నేనెప్పుడూ కాంగ్రెస్ అధిష్ఠానా న్ని గానీ, అసలైన నాయకులను గానీ విమర్శించలేదు.. భవిష్య త్తులోనూ వి మర్శించను.బయటి నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగి, ద శాబ్దాలుగా పార్టీ జెండా మో సిన అసలైన కాంగ్రెస్ శ్రేణులు అణచివేతకు గురవుతున్నారన్న దే నా ఆవేదన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం

కాంగ్రెస్ ప్రజా పాలనలో అసలైన ఉద్యమకారులకు సముచి త స్థానం, గుర్తింపు దక్కాలి.” సీ మాం ధ్ర నేతలు, మీడియా చెప్పుచేత ల్లో తెలంగాణ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ నడవకూడ దు. ఆత్మగౌరవం కోసమే రక్తమో డ్చి ప్రత్యేక రా ష్ట్రాన్ని సాధించు కున్నామన్నారు. ప్రజా పాలన అంటే పేద వాడి కన్నీళ్లు తుడవ డం.. అంతేగానీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కాదని పునరుద్ఘాటించారు.

   తెలంగాణ ప్రగతి కాంగ్రెస్‌తోనే

“తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందీ, తెచ్చిందీ కాంగ్రెస్ పార్టీనే.. రేపటి తెలంగాణ సమగ్రాభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాం లోనే భవిష్యత్ రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేశా రు. ఆలయ ప్రాంగణం నుంచి రాజ్ గోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పా ర్టీలోని అంతర్గత శక్తులకు, ఇ టు రాజకీయ వర్గాలకు స్పష్టమైన సంకేతాన్ని పంపాయి. ఆ త్మగౌ రవం, ఉద్యమ ఆకాంక్షలు, పేదల పక్షపాతమే కాంగ్రెస్ భవిష్యత్ ఎజెండా కావాలని ఆయన నొక్కి చెప్పారు.