OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Mla Komatireddy rajgopalreddy hot comments: బిగ్ బ్రేకింగ్, రాజగోపాల్‌రెడ్డి సం చలన వ్యాఖ్య,రాబోయేది వైయ స్సార్ యుగమేనని స్పష్ఠీకరణ

Mla Komatireddy rajgopalreddy hot comments : ప్రజా దీవెన, నార్కట్ పల్లి : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సం దర్భంగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో భావో ద్వేగ వాతావరణం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లంల లో వైయస్సార్ విగ్రహానికి మునుగోడు ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి పూలమాల వేసి నివా ళులర్పించారు.ఈ కార్యక్రమానికి నకిరేకల్, మునుగోడు ని యోజక వర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వై ఎస్సార్ అభి మానులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ సేవలను స్మరిం చుకుంటూ ఆయన ఆశయాలను కొనసా గిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.

నాడుపేదలకు అండగావైఎస్సార్

ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కుఎలా అండగా నిలవాలో దేశానికి చూపించిన నాయకు డు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. పేదలు కార్పొ రేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారంటే అం దుకు వైఎస్సార్ తీసుకొచ్చిన ఆ రోగ్య పథకాలే కారణమని అన్నా రు.రైతులకు ఉచిత విద్యుత్ అం దించిన ఘనత వైఎస్సా ర్‌దేనని, పేదలు, రైతుల కోసం ఆయన అ మలు చేసిన అనే క సంక్షేమ పథ కాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపా దించుకున్నాయని పేర్కొన్నారు.

 

    ఉదయ సముద్రంపై కీలకవ్యాఖ్య

నల్లగొండ ప్రాంతాన్ని కరువు, ఫ్లో రైడ్ సమస్యల నుంచి బ యటప డేలా చేయాలనే లక్ష్యంతో ఉదయ సముద్రం ప్రాజె క్టును తీసుకొ చ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని రాజ గోపాల్‌రెడ్డి అన్నా రు.గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టుపై సరైన శ్రద్ధ చూ పలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చే సి రైతులకు సాగునీరు అందించామని తెలిపారు.

      మాట ఇస్తే మడమ తిప్పం

వైఎస్సార్ ఆశయాల సాధన కో సం నిరంతరం పనిచేస్తామ ని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ మాట ఇస్తే మ డమ తిప్పని నాయకుడిగా ఉన్నారని, తాము కూడా అదే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అయి తే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుం చి నాయకులను ఆహ్వా నించడం మంచిదేనని, కానీ కొత్త గా వచ్చిన వారి కోసం తమ ఇం ట్లోనే ఉన్న వారిని బయ టకు పంపే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

     కార్యకర్తలకు అన్యాయoపై పోరాటం

“రాబోయేది రాజశేఖర్‌రెడ్డి యుగ మే” అని రాజగోపాల్‌రెడ్డి వ్యా ఖ్యానించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యా యం జరిగితే వారి తరఫున తాను పోరాడుతా నని స్పష్టం చేశారు.రాహుల్ గాం ధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేసి, నల్ల గొండ ప్రాంతాన్ని అభివృద్ధి పథం లో మరింత ముందుకు తీసుకెళ్తా మని ఆయన అ న్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బ్రాహ్మణ వెల్లం లలో జరిగిన ఈ కార్యక్ర మం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సా హాన్ని నింపింది. అయితే రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య లు మాత్రం స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మా రాయి.

Related Articles

Back to top button