AndhrapradeshOpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Mla Komatireddy rajgopalreddy worning to ABN : బిగ్ బ్రేకింగ్, ఆంధ్రమీడియాపై రాజగోపాల్ రెడ్డి ఫైర్,100 ఛానళ్లు పెట్టే సత్తామాకుంది, ఒళ్లు దగ్గర పెట్టుకావాలని వార్నింగ్

Mla Komatireddy rajgopalreddy worning to ABN :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సం చలన వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారారు. పార్టీ అంతర్గత వ్యవహారాల ను బయటకు తీసుకొచ్చి, తనపై దుష్ప్రచారం చేస్తూ వార్తలను ‘వండివార్చుతున్న’ ఓ ప్రముఖ తెలుగు మీ డియా సంస్థపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అ నంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తనపై వ స్తున్న కథనాల వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్రశ్నలు సంధించా రు.“ఆ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసo టూఘాటు వ్యాఖ్యలు చేశారు.

  కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉం టే మంచిది

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లా వార్తలు ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాజగో పాల్ రెడ్డి హెచ్చరించారు. “కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది.. లేకుంటే మర్యాద దక్కదు” అంటూ స ద రు మీడియా సంస్థకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.అంతే కా దు.. “నా ప్రతాపమే చూపించాల్సి వ స్తే ఓ ఛానల్, ఓ పేపరే ఉండదు.. ఆ మీడియా అధిపతికి ఇదే చెబుతున్నా” అం టూ తీవ్రస్థాయిలో స్పందించారు.

  ‘100 ఛానళ్లు పెట్టే దమ్ము మాకుంది’

తెలంగాణ కోసం నిజంగా పోరా డిన ఉద్యమకారులు, నిజా యితీగల నాయకులు ఎంతోమంది ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అ న్నారు. తాము అసలైన కాంగ్రెస్ నాయకులమని, పా ర్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి న చరిత్ర తమ దని గుర్తుచేశారు. మాలాంటి వ్యక్తులనే కించపరిచేలా, మా క్యారెక్టర్లను దెబ్బతీసేలా వార్తలు రాస్తే బాగుండదు” అంటూ హెచ్చరించారు. మీడియా, జర్నలిస్టులంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేసిన ఆయన మీడియా ముసుగులో వ్యక్తి త్వ హననానికి పాల్పడటం మాత్రం సహించబోమన్నారు.

వ్యక్తుల కోసం పనిచేసేవారికే వార్నింగ్

తాను అన్ని మీడియా సంస్థలను విమర్శించడం లేదని రాజ గోపా ల్ రెడ్డి స్పష్టం చేశారు.“ఎవరు వ్యక్తులకు కొమ్ముకాస్తూ, వారి కో సం పనిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో.. వా రికే నా వార్నింగ్” అని తేల్చిచెప్పారు.ఇక చివరగా మరింత ఘాటుగా స్పందించిన ఆయన..“మాకు కూడా 100 ఛానళ్లు పెట్టే దమ్ము, ధైర్యం ఉంది. ఆంధ్ర మీడియా ఛానళ్ల సర్టి ఫికె ట్లు మాకు అవసరం లేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చే శారు.రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీ యాలతో పాటు మీడియా వర్గాల్లో నూ చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్నింగ్‌కు సంబంధిత మీడియా సంస్థ నుం చి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

Back to top button