OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

MLA Mandula Samuel sensational comments : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సంచలన వ్యాఖ్య, దళిత నియోజకవర్గాల పై మీ పెత్తనమేoది రాజగోపాల్ రెడ్డి 

-- తుంగతుర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు -- ముందు నీనియోజకవర్గం మునుగోడు మురికిని చూసుకో -- నాహక్కులను హరిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా --నాడప్పు మోగుద్ది.. నా చిర్ర మోగుద్ది.. నా పని కత్తులు లేస్తాయి ఖబర్దార్ --బడుగు వర్గాలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక --తుంగతుర్తిలో టీపీసీసీ నియ మించిన మండల అధ్యక్షులే కొనసాగుతారు

MLA Mandula Samuel sensational comments : ప్రజా దీవెన,తుంగతుర్తి:దళిత నియోజ కవర్గం మీ పెత్తనం ఖబర్దార్ అని కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలగి రిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం లో శుక్ర వారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరె డ్డి రాజగోపాల్ రెడ్డి పై ఎమ్మెల్యే సామెల్ తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించా రు. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీ యాలపై వ్యాఖ్యా నిం చే నైతిక హక్కు వారికి లేదని స్ప ష్టం చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గం గురిం చి గాంధీభవన్‌లో మును గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యా స్పదమని మండిపడ్డారు. “మునుగోడు ఎ మ్మెల్యేకు నా నియోజకవర్గంతో ఏం సంబంధం ఉంది? ముందు నీ మును గోడు సమస్యలు, నీ .. మునుగోడు మురికిని చూసుకో. బీజే పీ నుంచి వచ్చిన నీతో పా టు వచ్చిన నాయకులకే మండ ల పార్టీ అధ్యక్ష పదవులు ఇప్పించ లేకపోయావన్నారు .కాం గ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు” అంటూ ఘా టుగా స్పందించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రో టోకా ల్‌ను ఉల్లంఘించారని ఆరోపించిన ఎమ్మెల్యే సామే లు, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చే స్తాననీ హెచ్చ రించారు. తుంగ తుర్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించి నా మంత్రి పట్టించుకోలేదని విమ ర్శించారు. అలాంటి వ్యక్తికి తన నియోజకవర్గంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.దళిత నియో జకవర్గాలపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలు మానుకోవాలని హె చ్చరిస్తూ, ” మా మాదిగ నియో జకవర్గాల జోలికి వస్తే సహిం చ నన్నా రు. రాజ్యాంగం ప్రకారం నా కు టికెట్ వచ్చింది. నేను ఎవరి దయాదాక్షిణ్యాలపై రాజకీయా ల్లోకి రాలేదు” అని స్పష్టం చేశా రు.

నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని, ఇక్కడ శ్రమజీవులే ఉం టారని పేర్కొంటూ, “నేను భయపడేది తుంగతుర్తి ప్రజలకు, ఓటర్లకు మాత్రమే. నాకు ఎవరిముందూ చేతులు చాచే అ వసరం లేదు” అని వ్యాఖ్యానించారు. నకిరేక ల్‌లో వేముల వీరేశానికి 67 వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలు, తనకు తుంగతు ర్తిలో 50 వేల మెజార్టీ ఇ చ్చారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ని బడుగు, బలహీన వర్గాల ప్రజలే నిలబెడుతున్నారని ఎ మ్మె ల్యే సామేలు అన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి న కొం దరు పార్టీని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వా రి ప్రయత్నాలు ఫలించవని హె చ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులే కొనసాగుతారని స్పష్టం చేశారు. వారి నియామకాలపై ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దే శించి మాట్లాడిన ఎమ్మె ల్యే సామే లు, ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీ వర్గానికి, మరొకటి యాదవ సామాజిక వర్గానికి కేటా యించాలని విజ్ఞప్తి చే శారు.అలాగే తన హక్కులను హరిం చే ప్రయత్నాలు కొనసాగితే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకె ళ్తా నని, అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తా నని ఎ మ్మెల్యే మందుల సామేలు హెచ్చ రించారు. నేను ఎమ్మెల్యేగా గెలి చిన తర్వాత 32 కోట్లతో బిక్కీరు వాగు పై ఆరు చెక్ డ్యాంలను పూర్తిచేస్తే నేడు సుమారు 12 వే ల ఎకరాల సాగు భూమి సస్య శ్యామలం అయ్యిందని తెలి పా రు. నియోజకవర్గ వ్యాప్తంగా సు మారు 170 కోట్లతో సీసీ రోడ్లు వే యించినట్లు తెలిపారు. 30 గ్రా మాలకు నూ తన గ్రామపంచా యతీ బిల్డింగులను నిర్మించినట్లు తెలిపా రు. సుమారు 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, తిరు మ లగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, 16 కోట్లతో తుంగతుర్తి మెయిన్ రోడ్డు మం జూరు చేయించినట్లు తెలిపారు.

తిమ్మాపురం నుండి వెంకేపల్లి గ్రా మం వరకు 18 కోట్లతో డబ ల్ రో డ్లు వేయించినట్లు తెలిపారు. అ దేవిధంగా మం త్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భుదాని గాని కాలువ ను మంజూరు చేయించి నట్లు తెలిపారు.ఈ సమావేశం లో తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుం కరీ జనార్ధన్ తో పాటు 8 మండ లాల అధ్యక్షులు, పిఎసి హెచ్ చై ర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వివి ధ గ్రామాల సర్పం చులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button