Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:34 am Posted by : praja deveena

MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశం,తక్షణమే డ్రైనేజీ సమ స్యలు పరిష్కరించాలి, మురుగు నీరునిల్వతో రోగాలకు ఆహ్వానం

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: ము నుగోడు పట్టణంలో మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా త క్షణ చర్యలు చేపట్టాలని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను స్వయంగా తె లుసుకునేందుకు మం గళవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌లో భాగంగా ఆయన ము నుగోడు పట్ట ణంలోని పలువార్డుల్లో గల్లీగల్లీ తిరిగి పరిశీలిం చా రు. మునుగోడు పట్టణంలోని 1, 2, 3వ వార్డుల్లో పర్యటిం చిన ఎమ్మెల్యే.. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తది తర అంశాలపై స్థానికులను అడి గి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

పర్యటనలో కొన్ని ప్రాంతాల్లో ము రుగునీరు సాఫీగా వెళ్లేందు కు అ డ్డంకులు ఉన్నట్లు గుర్తించిన రా జ్‌గోపాల్‌రెడ్డి.. వాటిని వెంటనే తొలగించి డ్రైనేజీ ప్రవాహానికి ఆ టంకం లేకుండా చ ర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి మురుగునీరు సాఫీగా వెళ్లే లా తక్షణ కార్యాచరణ ప్రారంభిoచాలని సూచించారు.

మురుగునీరు నిల్వ ఉండటం వ ల్ల దోమలు వృద్ధి చెంది డెం గ్యూ వంటి విషజ్వరాలు వ్యాపించే ప్ర మాదం ఉందని ఎమ్మె ల్యే పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రం గా ఉంచినప్పుడే ప్రజలకు ఆరో గ్యకరమైన వాతావరణాన్ని అందిం చగలమ న్నారు. అదే సమయంలో డ్రైనేజీ కనెక్టి విటీ, చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డు, చిట్యాల రోడ్డులోని మహాప్ర స్థానం వద్ద మౌ లిక సదుపాయాలు వంటి సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీ సుకెళ్లారు.

పట్టణంలోని భౌగోళిక స్థాయిల ను (Earth Levels) సమగ్రం గా అంచనా వేసి భవిష్యత్ అవస రాలకు అనుగుణంగా మె రుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉం దని రా జ్‌గోపాల్‌ రెడ్డి అన్నారు.ఇందుకోసం సమగ్ర మాస్టర్‌ప్లా న్‌ రూపొం దించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళి కలు సిద్ధం చేయాలని అ ధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎక్కడా ము రుగునీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మరో సారి స్పష్టం చేశారు.

అనంతరం బుల్లెట్‌ నడుపుకుం టూ పట్టణంలోని పలు ప్రాం తాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల ను పరిశీలించారు.ఈ కా ర్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, పం చాయతీ కార్యదర్శి, గ్రా మ సర్పం చ్‌, వార్డు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.