Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Election Notification: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

--ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ  --19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహర --29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

–ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ 

–19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ 

–29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్

ప్రజాదీవెన/ హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక నిమిత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ (Central Election Commission notification on Thursday regarding the by-election of two MLA quota MLC seats) జారీ చేసింది. ఈ రెండు సీట్లకూ విడివిడిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేర్వేరుగానే అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది.

గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ( Central Election Commission notification on Thursday regarding the by-election of two MLA quota MLC seats) కానుండగా ఈ నెల 18 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

కౌశిక్ రెడ్డి, కడియం రాజీనామాలతో: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా ( Elected MLAs Kadiam Srihari and Padi Kaushik Reddy resigned from their MLC posts) చేశారు. దీంతో ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటి పదవీ కాలం 2027, నవంబర్ 30 వరకూ ఉంది. కాగా, ప్రస్తుతం శాసనసభ్యుల బలాబలాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజార్టీ ఉంది. 2 స్థానాలకూ విడివిడిగా ఎన్నికలు జరగనుండడంతో ఆ స్థానాలు హస్తం పార్టీయే కైవసం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం…  రెండు మ్మెల్సీల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ( Aspirants in Congress party are more for two MLCs) ఉన్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ( Party preference for those who sacrificed ticket in assembly elections) ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, హర్కల వేణుగోపాల్రావు, అద్దంకి దయాకర్, మైనార్టీ కోటాలో మస్కతీ డైరీ యజమాని అలీ మస్కతి, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావిద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అటు ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లు ఉన్నారు. రెండు ఎమ్మెల్సీ పదవుల్లో మరి ఎవరిని ఎంపిక చేస్తారో అనే అంశం ఉత్కంఠగా మారింది.