‘Modi’ is good news for farmers: రైతన్నకు ‘ మోడీ’ శుభవార్త
--చిన్న, సన్నకారు రైతులకు మరింత మద్దతు --కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.3వేల పెన్షన్
రైతన్నకు ‘ మోడీ’ శుభవార్త
–చిన్న, సన్నకారు రైతులకు మరింత మద్దతు
–కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.3వేల పెన్షన్
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభు త్వం రైతన్న కోసం మరొక ప్రయోజనకర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పలు సంక్షేమ కా ర్యక్రమాలు, పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కెల్లా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రధాన మంత్రి కిసాన్ పథకం ఎంతో ప్రాచుర్యం పొందింది. సదరు పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైత న్నలు ఆర్థిక లాభాలను పొందుతున్నారు కూడా.
ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన మరో పథకం కూడా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేకూరుస్తోంది. అదే తాజాగా నిర్ణయం తీసుకున్న పథకం పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన కాగా పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన పథకాన్ని 2019లో లాంచ్ చేశారు. పీఎం కిసాన్ రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తే, పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన చిన్న రైతులకు నెలనెలా రూ.3,000 పెన్షన్ అందజేస్తుంది.
ఈ పథకం కింద అందరూ లబ్ధి పొందలేరు. రెండు హెక్టార్లు లేదా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి వయోపరిమితి కూడా ఉంది. ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారికి 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.ఇప్పటిదాకా ఈ స్కీమ్‌లో 19,47,588 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఇదొక పెన్షన్ లాంటి పథకం కాబట్టి పీఎం కిసాన్ లాగా కాకుండా ఈ పథకం కోసం డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. అర్హులైన రైతులు నెల నెలా రూ.55 నుంచి రూ.200 వరకు పింఛను నిధికి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ల నుంచి డిపాజిట్ చేయడం మొదలుపెడితే 60 ఏళ్ల వరకు మనీ జమ చేస్తూనే ఉండాలి, 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది.
నమోదు చేసుకున్న రైతు 60 ఏళ్లు నిండకముందే మరణిస్తే, వారి జీవిత భాగస్వామి పెన్షన్‌లో 50% ఫ్యామిలీ పెన్షన్‌గా అందుకుం టారు. 18 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరిన రైతులు నెలకు కనీసం రూ.55 చెల్లించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో చేరిన రైతులు నెలకు కనీసం రూ. 200 చెల్లించాలి.రైతులు సమీపంలో ఉన్న రైతు సంప్రదింపు సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ డీటైల్స్ అందించాల్సి ఉంటుంది.
రైతుల వయస్సు ప్రకారం, చెల్లించాల్సిన కనీస మొత్తం ఎంతో సెంటర్ నిర్వాహకులు చెబుతారు. అనంతరం ప్రతి నెలా ఎస్‌బీ అకౌంట్ నుంచి కొంత మొత్తం పెన్షన్ ఫండ్‌లో డిపాజిట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రైతులకు కిసాన్ పెన్షన్ అకౌంట్ నంబర్ (KPAN) లభిస్తుంది. కొద్ది రోజులకు కిసాన్ కార్డు జారీ అవుతుంది. ఆలస్యమెందుకు వెంటనే ఇందులో చేరి కేంద్ర ప్రభుత్వo అందిస్తున్న లబ్దిని సొంతం చేసుకోండి.