Mother and child tragedy in Markapur : బిగ్ న్యూస్, మార్కాపురంలో విషాదం, అమ్మంటే అమ్మే తన ఊ పిరిని వదిలి, మరో ప్రాణానికి ఊపిరిపోసిన త్యాగమూర్తి

Mother and child tragedy in Markapur : ప్రజా దీవె న, మార్కాపురం: కడు పులో పెరుగుతున్న ప్రాణం కోసమే ఆ తల్లి గుండె చివరివరకు కొ ట్టుకుంది. “నువ్వు బతకాలం టే బిడ్డను వద్దనుకోక తప్పదు” అని వైద్యులు హెచ్చరించి నా, “నేను పోయినా పర్లేదు… నాబిడ్డ ఈ లోకాన్ని చూడాలి” అని నిర్ణయిం చుకుంది ఆ వీరమాత. లేక లేక కలిగిన సం తానం కోసం తన ప్రా ణాలనే పణంగా పెట్టింది. సిజేరియన్ ఆపరేషన్ విజయవంత మై, పండంటి మగబిడ్డ ఈ లో కం లోకి అడుగుపెట్టాడు. కానీ, ఆబిడ్డ ఏడుపు వినేంత వ్యవధి కూడా ఆ తల్లికి దక్కలేదు. కన్న బిడ్డను కళ్లారా చూసు కో కుండానే, తనివితీరా గుండెలకు హత్తు కోకుండానే ఆమె త నువు చాలించింది.
రేపటితరం లోకంలో బిడ్డ పెరిగి పెద్దయ్యాక
“అమ్మా… నిన్ను నేను చూడలే దు, నీ ఒడిలో సేదతీరలేదు. కానీ నా శరీరంలోని ప్రతి రక్తబొట్టులో నువ్వే ఉన్నావు” అని ఆ బిడ్డ రా బోయే రోజుల్లో అనుకునే ప్రయా ణాన్ని ఊహిస్తే గుండె కలచివే స్తుంది.మానవత్వం, సాంకేతికత ఎంత ముం దుకు వెళ్లినా అమ్మ ప్రేమ ముందు ఏదీ సాటిరాదనడానికి ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యం.
భవిష్యత్తులో ఆ బాబు పె ద్ద య్యి తన తల్లి కథను తెలుసు కున్నప్పుడు, ఆమెత్యాగం ఆ బిడ్డకు జీవన మార్గదర్శిగా ని లుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండబోదు. కన్నపే గు బంధానికి రూపం లేక పో వచ్చు, కానీ ఆ ప్రేమకు మర ణం లేదు. కంటికి కనిపించని దే వతగా ఆ తల్లి ఎప్పుడూ తన బి డ్డను కాపాడుకుంటూనే ఉంటుందని ఈ తాజా సంఘటన నిలువెత్తుసాక్ష్యంగా నిరూపిస్తోంది.





