Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 1:05 pm Posted by : praja deveena

MP Chamala Kiran Kumar Reddy : బిగ్ బ్రేకింగ్,భువనగిరి ఎంపీ చామ ల కిరణ్ కీలకవ్యాఖ్య, మహిళా సా ధికారతతోనే ఉజ్వల భవిష్యత్తు

 

MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవెన, ఫి లిప్పీన్స్: మనీలా ఆసియా-పసిఫిక్ పార్లమెంటరీ ఫో రంలో భారతదేశం తరపున భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డి చారిత్రాత్మక ప్రసంగం చేశారు.రాబోయే రోజుల్లో ప్రపంచ పాల న లో మహిళలపాత్రే అత్యంత కీలకం కాబో తోందని, లింగసమానత్వంతో కూడిన పాలన ద్వారానే దే శాలు స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించగలవని భువనగిరి పార్ల మెంట్ సభ్యుడు స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌ లోని మనీ లాలో ఫ్రీడ్రిచ్ -ఎబర్ట్-స్టిఫ్టంగ్ (FES) ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 3 వరకు అ త్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘రీ జనల్ డైలాగ్ ఆన్ జెండర్-జస్ట్ గవర్నెన్స్’ అంతర్జాతీయ సదస్సు లో ఆయన భారతదేశం తరపున ప్రాతినిధ్యం వ హించారు. ఈ సందర్భంగా ఆసియా-పసిఫిక్ పార్లమెంటరీ ఫోరంలో “ఆసియా-పసిఫిక్‌లో లింగ సమానత్వ పాలన” అనే అం శంపై ఎంపీ చేసిన ప్రసంగం అంతర్జాతీయ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది.

భారతదేశం ఇప్పటికే భవిష్యత్ వైపు అడుగులు వేస్తూ మ హిళా సాధికారతలో సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తోందని ఎంపీ వివరించారు. దేశంలో అంగన్‌వాడీ సేవలు, గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) తో పాటు స్థానిక సంస్థల్లో మ హిళల భాగస్వామ్యం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పే ర్కొన్నా రు. ముఖ్యంగా తెలంగాణ ప్రభు త్వం భవిష్యత్ త రాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ ప థకం, మహిళా స్వయం సహా య క సంఘాల (SHG) బలోపేతం, మరియు స్థానిక సంస్థల్లో అందిస్తున్న 50 శాతం రిజర్వేషన్లు మహిళల సామాజిక, రాజకీయ చిత్రపటాన్నే మార్చేశాయని ఆయన ప్రపంచ దేశా ల ప్రతినిధులకు సగర్వంగా వివరించారు. తెలంగాణ మోడ ల్ నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియా డారు.

భవిష్యత్ కార్యాచరణకు ఎంపీ పిలుపు

మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదని, అది బలమైన ప్రజాస్వామ్యానికి మరియు సమ్మిళిత భవిష్యత్తు కు పునాది అని ఎంపీ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆసియా-పసి ఫిక్ దేశాల ముంగిట ఆయన మూ డు ముఖ్యమైన భవిష్యత్ సూత్రాలను ఉంచారు.

మహిళలకు కేవలం హక్కులు ఇ వ్వడమే కాకుండా, వారిని కీలక ని ర్ణయాత్మక రాజకీయ శక్తులుగా ఎ దగడానికి పూర్తి ప్రోత్సాహం అం దించాలని,రాబోయే బడ్జెట్‌లలో మహిళల ఆర్థిక స్వావలంబనకు, సంరక్షణ సేవలకు ప్రత్యేక నిధులు కేటాయించి, వారిని ఆర్థికంగా స్వ తంత్రులను చేయాలని, మహిళా సమానత్వంపై చేసే తీర్మానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేసి భ విష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని, సమానత్వంతో కూడిన ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందు కు ఆసియా-పసిఫిక్ ప్రాంత పార్ల మెంటేరియన్లంతా సరికొత్త సంకల్పంతో ముం దుకు సాగాలని భువనగిరి ఎంపీ పిలుపునిచ్చారు.ఈ స దస్సులో పలు దేశాల ప్రతినిధులు భారత్ మరియు తెలం గాణ సాధించిన విజయాలను అభినందించారు.