Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 10:48 am Posted by : praja deveena

Mp chamala kiran kumar reddy : బిగ్ బ్రేకింగ్, భువనగిరి రోడ్లకు మహర్దశ, కేంద్ర మంత్రి గడ్కరీతో ఎంపీ చామల కీలక భేటీ

Mp chamala kiran kumar reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భువ న గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు భద్ర త, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అ డుగు పడింది. కేంద్ర రో డ్డు రవాణా, రహదారుల శాఖ మం త్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి నియోజకవర్గంలోని పెండింగ్ రోడ్డు మౌలిక వస తుల పనులను వేగవంతం చేయాలని కోరారు.ఈ సంద ర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన వినతిపత్రాల ను అందజేసిన ఎం లపీ పెరుగుతున్న ట్రాఫిక్, పట్టణీకరణ, పారిశ్రామిక కార్యకలాపాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ, భద్రతా చర్యలు అత్య వసరమని వివరించారు.

   NH-163పై ప్రధానంగా దృష్టి

హైదరాబాద్–వరంగల్ మధ్య ఉ న్న NH-163ను ఆరులైన్ల జాతీ య రహదారిగా అప్‌గ్రేడ్ చేయా లని ఎంపీ కోరారు. ఈ మార్గంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉం చుకుని విస్తరణ ప నులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చే శారు.అదే సమయంలో అనంతారం క్రాస్ రోడ్డు, ప్రభుత్వ ఐ టీఐ కాలేజ్–రామకృష్ణపురం గ్రామ క్రాస్ రోడ్డు, స్వర్ణగిరి ఆ లయం, సింగన్నగూడెం ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.

భువనగిరి కేంద్రీయ విద్యాలయం సమీపంలోనూ సర్వీసు రో డ్డు ఏర్పాటు చేయాలని ప్రతిపా దించారు.బీబీనగర్ ఎయిమ్స్ వ ద్ద ఇప్పటికే మంజూరైన ఆరులైన్ల ఫ్లైఓవర్ ప నులను ప్రారంభించాలని, పగిడిపల్లి 12వ వార్డులో పెండిం గ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కూడా ఎంపీ కోరారు.

నకిరేకల్ వైపు కూడా కీలక ప్రతిపాదనలు

నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం లోని NH-565పై రహదా రి విస్తరణతో పాటు పలు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవ ర్లు, సర్వీసు రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలని చామల కిర ణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.నకిరేకల్–తాటికల్ రోడ్డు విస్తర ణ, చందంపల్లి వద్ద లూప్ ఫోర్, పద్మ నగర్, ఇనుపముల వద్ద ఫ్లైఓవర్లు, కోర్లపహాడ్, కేతేపల్లి, చీ క టిగూడెం, వట్టిమర్తి, పిట్టంపల్లి ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

 భక్తుల భద్రతకు ప్రత్యేకచర్యలు

NH-365 హైదరాబా ద్–విజ యవాడ రహదారిపై లక్ష్మారెడ్డి ల్లెం–పెద్ద అంబర్‌పేట్ సమీపం లోని హనుమాన్ ఆలయం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎంపీ ప్రత్యేకం గా ప్రస్తావించారు. పండుగల సమయంలో భక్తుల రద్దీ పెరగ డంతో ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాల ముప్పు ఏర్పడుతోందని వివరించారు.

భువనగిరి, పరిసర ప్రాంతాల ప్ర జలకు మెరుగైన కనెక్టివిటీ క ల్పించడం, ప్రమాదాలను తగ్గిం చడం, ట్రాఫిక్ రద్దీని ని యంత్రించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు కీ లకమని ఎంపీ పే ర్కొన్నారు. పెండింగ్ పనులపై కేంద్రం సానుకూలంగా స్పం దించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటే భువనగిరి రహ దారి మౌలిక వసతుల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకా శం ఉందని తెలిపారు.