Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:48 pm Posted by : praja deveena

MP Chamala Kiran Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, డల్లాస్ వేదికగా భా రతీయ ప్రతిభను చాటిన భువన గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 

MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవెన, డ ల్లాస్: ప్రపంచ య వనికపై భారతదేశ ఖ్యాతిని సగ ర్వంగా నిలబెడుతున్నది ప్రవాస భారతీయులేనని భువనగిరి పా ర్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు. అమెరికాలోని డల్లాస్‌లో ‘ఇండియా అసోసియే షన్ ఆఫ్ నార్త్ టెక్సాస్’ (IANT) అత్యంత వైభ వంగా నిర్వహిం చిన భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

భారతదేశం నేడు ప్రాచీన సం స్కృతికే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతికత, అజేయ మైన ఆర్థిక శక్తి, అంతరిక్ష అన్వేష ణలతో భవిష్యత్ ప్రపంచాన్ని శాసిస్తోందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విప్లవం నుంచి అగ్రశ్రేణి అంతరిక్ష పరి శోధనల వరకు భారత్ 21వ శతాబ్దపు చోదక శక్తిగా ఎది గిం దని పేర్కొన్నారు. విదేశా ల్లో భారతీయ సంస్కృతిని కా పా డుతూ వ్యాపార-సాంకేతిక రంగాల్లో శిఖరాలను అధిరోహి స్తున్న ప్రతి ప్రవాస భారతీయుడూ దేశానికి గర్వకారణమ న్నారు.

    భారత మూలాల పరిరక్షణ

భావితరాలకు మన మూలాలు, పండుగలు, విలువలను అంది స్తూ ప్రపంచవ్యాప్తంగా భారత స్ఫూర్తిని సజీవంగా ఉంచుతున్న తీరు ప్రశంసనీయమన్నారు.ఈ అంతర్జాతీయ వేడుకల్లో భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజు నాథ్ తో పాటు స్థానిక అగ్ర నేత లు పాల్గొన్నారు.టెక్సాస్ స్టేట్ ప్రతి నిధి మాట్ షాహీన్, ఫ్రిస్కో మేయర్ , మార్క్ హిల్, రిచర్డ్‌స న్ మేయర్ అమీర్ ఒమర్, ఆర్లిం గ్టన్ మేయర్ జిమ్ రాస్, డల్లాస్ కౌంటీ కమిషనర్, డిస్ట్రిక్ట్-2, ఆం డ్రూ సోమర్‌మన్ ఈ సందర్భం గా అమెరికాలో నివసిస్తున్న భార తీయ సమాజా నికి ఎంపీ చామ ల కిరణ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్స వ శుభాకాంక్షలు తెలియ జేశారు.