
Mp ChamalaKiran Kumar Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో కొత్తవేడి రాజుకుంది. కవి త తెలంగాణ రాష్ట్ర సేన (trs) పై ఎంపీ చామల కిరణ్ కుమా ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్య లు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒ క కొత్త పార్టీ పుట్టుక, దా నిపై ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలు ఇప్పు డు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. క ల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరు తో కొత్త పార్టీని ప్ర కటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చా మల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గా ల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
శనివారం హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి (Mp ChamalaKiran Kumar Reddy) కవిత కొత్త పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కొత్త పార్టీ పెట్టినందుకు ముందుగా ఆమెకు ధ న్యవాదాలు చెబు తూనే, ఆ పార్టీ వెనుక ఉన్న ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆ ర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కవిత ఎం దుకు మౌనంగా ఉన్నారు అప్పుడు పార్టీ పెట్టి ఉంటే ప్రజలు నమ్మేవారు కదా అని ఆయన ప్రశ్నించారు.
పంచుకునే వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు బయ టకు వచ్చారని ప్రజలు భావిస్తున్నారని ఘాటుగా విమర్శిం చారు.జేబులు చూసి కాదు, కడుపు చూసి పాలిస్తా” అన్న క విత వ్యాఖ్యలపై సెటైర్ “అమ్మగా జేబులు చూసి కాదు, క డుపు చూసి పాలిస్తా” అని కవిత చేసిన వ్యాఖ్యలను ఎంపీ కిరణ్ కు మార్ రెడ్డి తమదైన శైలిలో తిప్పి కొట్టారు. గత ప దేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు ప్రజల ‘జేబులు’ చూసే పరిపాలన సాగించారని” ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘క ర్కో టకుడు’, ‘హిట్లర్’ అం టూ కవిత విమర్శించడంపై ఎంపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ, అభి వృద్ధి పనులు చేస్తున్నందుకు సీఎం కర్కోటకులు అవు తారా? అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చే స్తున్నారు. కవితకి రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉందని ఒ ప్పుకుంటూనే, ఆమెపై కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధించా రు ఎంపీ కిరణ్. కవిత తెల్ల కా గితం కాదని, పదేళ్ల బీఆర్ఎ స్ పాలనలో ఎంపీగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిం చా రని గుర్తు చేశారు. కాబట్టి ఆమెను ప్రజలు నమ్మే పరిస్థితిలే దని తేల్చి చెప్పారు.
తెలంగాణను దోచుకోవడానికే మళ్లీ సీఎం కావాలని అను కుంటున్నారా అని నిలదీశారు. తెలంగాణలో ప్రజా ప్రయో జనాల కోసం నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తేనే తాము స్వాగతిస్తామని స్ప ష్టం చేశారు. ఒక వైపు కవిత కొత్త పార్టీ తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధ మవుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆ మెను గత బీఆర్ఎస్ పాలనతో ముడిపెడుతూ తీవ్రంగా ఎ దురుదాడి చేస్తోంది.
ఈ మాటల యుద్ధం ముందు ముందు మరిన్ని మలుపు లు తిరిగే అవకాశం ఉందో అని రాజకీ యాల్లో ఈ కొత్త పరిణా మం పై మీ అభిప్రాయం ఏమిటి కవి త కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



