MpChamalaKiranKumarReddy : ఎంపీ చామల కీలకవ్యాఖ్య, బీఆర్ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు
ఎంపీ చామల కీలక వ్యాఖ్య, బీఆర్ ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడు తూ ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు
MpChamalaKiranKumarReddy : ప్రజా దీవెన, హైదరా బాద్: బీఆర్ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని కేటీ ఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ చేసి న వ్యాఖ్య ల్లో రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల మీద బీఆర్ఎస్ నేతలకు ప్రేమ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
గ్రూప్-1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభు త్వంలో రాకూడదని కేటీఆర్ ( ktr ) కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పరీక్షల్లో 563 అభ్య ర్థుల దగ్గర రూ.3కో ట్ల లెక్కన తీసుకొని ప్రభుత్వం వాళ్ల ను ఎంపిక చేసిందని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గత బీఆ ర్ఎ స్ హయాంలో ఒక్క ఉద్యో గం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ రె డ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నా రని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లల భ విష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. న్యాయనిపుణుల (leagal ) సలహాలు తీసు కుని, ఎట్టి పరిస్థితు ల్లోనూ అడ్డం కులు రావద్దన్న సదుద్దేశంతో గ్రూ ప్-1 పరీక్షలు నిర్వ హించామని గు ర్తుచేశారు. 563 మంది అభ్యర్థుల తల్లిదండ్రు లం దరికీ మూడు కోట్లు పెట్టే స్థోమత ఉంటుందా అని ఆయన ప్రశ్నిం చారు.
రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం పై కేటీఆర్ నిందలు వేస్తున్నారని ఆ రోపించారు. ప్రజలను తప్పుదోవ ప ట్టిస్తున్న కేటీఆర్‌కి గ్రూప్-1 కు ఎం పికైన అభ్యర్థుల తల్లిదండ్రులు మీ డియా ముందుకొచ్చి బు ద్ది చెప్పా లని సూచించారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన మాట ల్లో ప్రజలకు నిజం తెలియాలంటే 563 గ్రూ పు-1 అభ్యర్థుల తల్లి దండ్రులు స్పందించాలని ఆయన కోరారు. ఆ దివారం తాను మా ట్లాడిన తర్వాత తక్షణమే వారెక్కడుంటే అక్కడ నుంచి వీడియోలు చెయ్యాలని చా మల పిలుపునిచ్చారు.
తమ ఆర్థిక స్థోమతను వీడియోలో వివరించాలని కోరారు. ఇది పా ర్టీ సమస్య కాదని మన బిడ్డల సమస్యని స్పష్టం చేశారు. రోడ్డు మీ దికి రావాలి ప్రెస్‌మీ ట్‌లు పెట్టాలని సూచించారు. లేని సమస్య ను సృష్టిస్తున్న కేటీఆర్‌ను చెప్పుదెబ్బలు కొట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.