multiple road accidents in Telangana : బిగ్ బ్రేకింగ్, పొద్దు పొద్దుగాళ్ల రక్త సిక్తమైన రోడ్లు, సాంకేతికత యు గంలోనూ ఆగని ‘మృత్యు’ వేగం

multiple road accidents in Telangana : ప్రజా దీవెన, హైదరాబాద్: మనం డ్రైవర్‌లేని కార్లు, ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటున్న కాలంలో ఉన్నాం. కానీ, రోడ్లపై ప్రాణాలు గాల్లో కలసిపోయే విషాదా లు మాత్రం మారడం లేదు. సాం కేతికత ఎంత పెరిగినా, మానవ తప్పిదాలు మరి యు దురదృష్టంతోడైతే రోడ్లు ఎలా మృత్యుపాశాలుగా మా రుతాయో చెప్పడానికి తాజాగా తెలంగాణలో జరిగిన రెం డు వేర్వేరు ప్రమాదాలే నిదర్శనం. కొన్ని సెకన్ల వ్యవధిలో ఆ రు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సా ధా రణంగా హైవే లపై ప్ర యాణించేటప్పుడు వాహనం ఆపా ల్సి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోం ది.
సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల వద్ద ఒక మినీట్రక్కు టై ర్ పంక్చర్ కా వడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అదే స మయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన ఒక భారీ లారీ, ఆ గి ఉన్న మినీట్రక్కును బలంగా ఢీకొట్టింది. కంటిరెప్ప మూసి తెరిచేలోపు ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడేగాల్లో కలిసి పో యాయి.
మురహరిపల్లి వద్ద ‘కంట్రోల్’ తప్పిన వేగం
మరోవైపు మేడ్చల్ జిల్లాలో అతివేగం ఒక నిండు కుటుం బాన్ని బలితీ సుకుంది. భవిష్యత్తులో వేగాన్ని నియంత్రించే ఎన్ని సెన్సార్లు వచ్చి నా, స్టీరింగ్ చేతిలో ఉన్నప్పుడు అ లస త్వం వహిస్తే జరిగే నష్టాన్ని ఇ ది చూపిస్తోంది. తుర్కపల్లి- ముర హరిపల్లి మధ్య ఒక కారు విపరీత మైన వేగంతో దూ సుకెళ్లింది. ని యంత్రణ కోల్పోయిన ఆ కారు ఒ క్కసారిగా డివైడర్ ఎక్కి, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలం గా ఢీకొట్టింది. ఈ ఘోరప్రమాదం లో ఒకే కుటుంబానికి చెం దిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు. ఆకు టుం బంలో మిగిలింది కేవలం చీకటే.
భవిష్యత్తు ప్రయాణాలకు ఒక హెచ్చరిక
ఎంత ఆధునిక కాలంలోకి అడు గుపెట్టినా రోడ్డు భద్రతా ని యమాలు పాటించకపోతే లగ్జరీ కార్లయి నా, హైవేలయినా మృత్యుకుహ రాలుగా మారుతూనే ఉంటాయి. వేగాన్ని త గ్గించండి… ప్రాణాలను కాపాడుకోండని పోలీసులు తెలి య జేస్తున్నారు.




