Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 2:57 am Posted by : praja deveena

Muncipal elections : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి జిల్లాలో మేయర్, చైర్ పర్సన్ లు వీరే, నేడు మధ్యాహ్నం ముహూర్తం ఖరారు

బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి జిల్లాలో మే యర్, చైర్ పర్సన్ లు వీరే, నేడు మధ్యాహ్నం ముహూర్తం ఖరారు

Muncipal elections : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి న ల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు నేడు సోమవారం ప్రమా ణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12. 30 నిమిషములకు ఆయా మున్సిపాలిటీలతోపాటు నల్ల గొండ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎంపిక చేసే ప్రక్రియ దాదాపు ఖరారైంది.

నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి పేరు ఎన్నికలకు ముందే మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ మేయర్ పదవి విషయంలోనే కొంత సస్పెన్స్ కొనసాగుతు న్నప్పటికీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కార్పోరేటర్ ఇ బ్రహీంనే వరించనుందన్న ప్రచా రం ఇప్పటికే పతాక స్థాయి కి చేరుకుంది.

ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుండగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా  భూతరాజు దశరథ, చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పం దిరి గీత, హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారె డ్డి, నందికొండ చై ర్మన్ గా మానస స్వర్ణలు దాదాపు ఖరారై మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేసుకున్నా రు.

ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కు వచ్చేసరికి సూర్యాపేట మున్సి పల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత లక్ష్యాది, కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు, హుజూర్ న గ ర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చై ర్మ న్ గా తన్నీరు మల్లికార్జున్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చినవెంకట్ వెంకట్ రెడ్డి వైస్ చైర్మన్ నూకల సం దీప్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి ర ఘునందన్ రెడ్డి లు కూడా ఇప్పటికే అంతా ప్రమాణ స్వీకా రానికి రంగం సిద్ధం చేసుకున్నారు

అదే సమయంలో యాదాద్రి భువ నగిరి జిల్లా కు వచ్చేసరికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎవరి పేరు ఇప్పటికీ ఖరా రు కాక సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రమాణ స్వీకారానికి చివ రి సమయంలో చైర్మన్ ఎవరనేది ప్రకటించి ఆ వెంటనే ప్ర మాణస్వీకారానికి వెళ్లేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తె లుస్తోంది.

ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరి గుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి, మో త్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న, చౌటు ప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగు దల పావని రమేష్ గౌడ్, పో చంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశంలు మధ్యాహ్నం జరిగే ప్ర మాణస్వీకారానికి సిద్ధమయ్యారు.