OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Munugode MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, నియోజకవర్గ సమగ్రాభివృద్దే ధ్యేయం

--మునుగోడులో రూ.57.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

Munugode MLA Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిల పడమే లక్ష్యంగా ము నుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి మౌలి క వసతుల కల్ప న, చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 57 కోట్లకు పైగా విలువైన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు చేనేత సహకార సొసైటీ ప్ర మాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు.

రహదారుల విస్తరణకు రూ. 57 .40 కోట్లు కేటాయింపు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేం దు కు భారీ నిధుల తో R&B రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టా రు. కోతులారం కొంపల్లి రహదారి మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కోతులారం నుండి కొంపల్లి వరకు 6.2 కిలోమీటర్ల మేర రూ. 19.50 కో ట్ల అంచనా వ్యయంతో R&B రోడ్డు అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు.

చండూరు మండలం ధోనిపాముల నుండి నేర్మట, కొండాపు రం మీదుగా కొంపల్లి వరకు13 కిలోమీటర్ల మేర రూ. 37.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ర హదారి పనులకు పూజలు ని ర్వహించారు. ఈ కార్యక్రమాల్లో R&B శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నా యకులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

 

కార్మికులకు-ప్రభుత్వానికి వారధి సహకార సంఘాలు”

మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన చేనేత సహకా ర ఉ త్పత్తి క్రయవిక్రయ సంఘం నూ తన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, ఎన్నికైన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సం దర్భంగా పాలకవర్గ స భ్యులు ఆయనను ఘనంగా స న్మా నించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మా ట్లా డుతూ మునుగోడు నియోజకవ ర్గం చేనేత కళకు, కార్మి కుల ప్రతి భకు పెట్టింది పేరు. అయితే మ రమగ్గాల రాకతో చేనేత కార్మి కుల జీవన స్థితిగతులు అస్తవ్యస్తంగా మార డం, ఉపాధి అవకా శాలు తగ్గడం ఆవేదన కలిగిస్తోం దన్నా రు. చేనేత సహకార సొసై టీలు కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి వారి సంక్షేమానికి తోడ్పడాలని సూచించారు.

తాను రాజకీయాల్లోకి రాకముం దే, దివంగత ముఖ్యమంత్రి వై. ఎ స్. రాజశేఖర్ రెడ్డి హయాంలో చేనేత కార్మికుల సమ స్యలను దగ్గరుండి చూసి వారి రుణాలు మాఫీ చేయించ డంలో కీలక పాత్ర పోషించానని గుర్తుచేశారు. నియో జక వర్గంలోని అన్ని చేనేత సహకార సంఘాల సభ్యులతో చ ర్చించి, వారి సమస్యలను విడతల వారీగా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హా మీ ఇచ్చారు.

Related Articles

Back to top button