Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 2:08 pm Posted by : praja deveena

Munugodu MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక ప్రకటన, నియోజకవర్గంలో పదివేల మందికి కాంతినివ్వడమే లక్ష్యo 

Munugodu MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: నా మునుగోడు నియోజకవర్గం లో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దు. ప్రతి ఒక్కరికీ స్పష్టమైన చూపును అందించే బాధ్యత నాది. నేనున్నాను ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని రండి అంటూ ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు భ రోసాచ్చారు. మునుగోడు గడ్డపై ఒక నిశ్శబ్ద విప్లవం నడు స్తోంది. అంధకారాన్ని తరిమికొట్టి, ప్రతి కంటిలోనూ వెలు గు లు నింపే ఒక మహా యజ్ఞం నిరంతరాయంగా సాగుతోం ద ని చెబుతూ తన నియోజకవర్గ ప్రజల కంటి సమస్యలను తీ ర్చేందుకు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భీష్మిం చుక కూర్చున్నారు. ఒక ఎమ్మెల్యేగా కంటే ని యోజకవర్గంలోని ప్రతి తల్లికి, తండ్రికి పెద్ద కొడుకుగా మా రి ఆయన అందిస్తున్న ఆత్మీయ భరోసా ఇప్పుడు మునుగోడు వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 ఫౌండేషన్ వెలుగుల ప్రయాణంలో 15వ అడుగు

తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఏ ర్పాటు చేసిన ‘కోమటిరెడ్డి సుశీ ల మ్మ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మరి యు ప్రసిద్ధ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల పరంపర కొనసాగుతోంది. తాజాగా చౌ టుప్పల్ వేదికగా 15వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం అ త్యంత వైభవంగా ప్రారంభమైంది. తన తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, భావోద్వేగాల నడుమ రాజ గోపాల్ రెడ్డి ఈ శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.తాజా శి బి రానికి ఊహించని స్పందన లభించింది. ఏకంగా 1,210 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 208 మం దికి పైగా శస్త్రచికిత్సల కోసం వైద్యులు ఎంపిక చేశారు. వీరం దరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయించే బాధ్యతను రాజగో పాల్ రెడ్డి స్వయంగా భుజానకెత్తుకున్నారు.

    గణాంకాల్లో ‘కాంతి’ రేఖలు

కేవలం మాటలు చెప్పడం కాదు…చేతల్లో చూపించడమే ల క్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఇప్పటివరకు 10,444 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 2,325 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయించడమే కాకుండా 4,557 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.

వివిధ విడతల్లో లబ్ధి పొందిన ము నుగోడు వీరుల వివరా లు ఇలా ఉన్నాయి.1వ విడత మునుగోడు లో 216 మంది, 2వ విడత ము నుగోడులో 108 మంది, 3వ విడత చం డూ రు మున్సిపాలిటీ ము నుగోడులో నిర్వహణ 129 మంది, 4 వ విడత నాంపల్లి మండల కేంద్రంలో 229 మంది, 5వ విడ త మర్రిగూడ మండల కేంద్రంలో 171 మంది, 6వ విడత చండూరులో బంగారిగడ్డ198 మంది, 7వ విడత ఘట్టుప్ప ల్ మండల కేంద్రంలో 65 మంది, 8వ విడతలో నారాయ ణ్ పూర్ మండలం132 మంది,

9వ విడత చౌటుప్పల్ మున్సిపా లిటీలో 82 మంది, 10వ విడత | చౌటుప్పల్ మండలంలో 160 మం ది, 11వ విడత మునుగోడులో 25 7 మంది, 12వ విడత మునుగోడు క్యాం ప్ ఆఫీస్ (చండూరు ప్రజలకు) లో 223 మంది, 13వ విడ త మునుగోడు క్యాంప్ ఆఫీస్ (నాంప ల్లి ప్రజలకు) లో 228 మంది, 14వ విడత మర్రిగూడ మండల కేంద్రంలో 127 మం దికి కాంతినివ్వడo జరిగిందన్నారు.

  నిరంతరాయంగా కాంతియజ్ఞంలో టార్గెట్ 10వేలు

మునుగోడు నియోజకవర్గంలో రా బోయే రోజుల్లో కంటి స మస్య అ నేదే లేకుండా చేయడమే తన అంతిమ లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం ఏకంగా 10,0 00 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించాలనే భారీ టార్గెట్‌ను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇది ఇక్కడితో ఆగి పోయే కార్యక్రమం కాదని, మునుగోడులో కంటి సమ స్యలతో బాధపడే చివరి వ్యక్తికి కూడా చూపు వచ్చేంతవర కు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఒక నిరంతర ప్రక్రియగా సా గుతూనే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ గా సొంత ఖర్చులతో, కార్పొరేట్ స్థా యి వైద్య సేవలను గ్రామీణ ప్రజల చెంతకు తెస్తున్న ఎమ్మెల్యే చొరవ పై నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా ప్రశంసల జల్లు కురు స్తోంది. చూపు లభించిన వృద్ధులు, పేదలు రాజగోపాల్ రెడ్డి ని పెద్ద కొడుకులా దీవిస్తున్నారు.