Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Munugodu so happy : మురిసిన మునుగోడు

--ఎప్పుడెప్పుడా అనుకునే సోలిపురం బ్రిడ్జికి నిధులు మంజూరు --రూ. 404.50 లక్షలకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -- మంత్రి హామీ నెరవేరడంతో మునుగోడు సోలిపురం వాసుల సో హ్యాపీ

మురిసిన మునుగోడు

 

–ఎప్పుడెప్పుడా అనుకునే సోలిపురం బ్రిడ్జికి నిధులు మంజూరు
–రూ. 404.50 లక్షలకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
— మంత్రి హామీ నెరవేరడంతో మునుగోడు సోలిపురం వాసుల సో హ్యాపీ

ప్రజా దీవెన/ నల్లగొండ: మునుగోడు నియోజకవర్గం నాడు  ముందనుకున్నట్లే మురిసింది. ఎందుకు అనుకుంటున్నారా అదే మొన్నటికి మొన్న మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీ ఎట్టకేలకు ఆచరణ (Power Minister Guntakandla Jagadish Reddy’s earlier promise to the people has finally come true) లోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ ఆభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆదరిస్తే అండగా నిలుస్తామని అప్పట్లో ఖచ్చితమైన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మునుగోడు మండల కేంద్రం నుండి సోలిపేట్ గ్రామం మార్గం మధ్యలో బ్రిడ్జి నిర్మాణం ( Construction of a bridge in the middle of the road from Munugodu mandal center to Solipet village)  కోసం దశాబ్దాల తరబడి నిరీక్షణకు పరిష్కారం చూపుతామని మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ క్రమoలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అనేక దఫాలు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి రాష్ట్ర నీటి పారుదల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

అందుకు అనుగుణంగా అధికారులు రూపొందించిన డి పి ఆర్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా పరిశీలించి తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లగా తదనుగుణంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోలీపురం బ్రిడ్జి నిర్మాణానికి నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారమే అధికారులు రూ. 404.50 లక్షల నిధుల (On Saturday, with the orders of the CM, the officials paid Rs. 404.50 lakh funds) తో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా దశాబ్దాల కాలం నుండి ఏ ఎన్నికలు వచ్చినా మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సోలిపురం బ్రిడ్జి ఎన్నికల ప్రధానాంశంగా పతాక స్థాయిలో చర్చనీయాంశమైన విషయం విదితమే. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సోలిపురం బ్రిడ్జి నిర్మాణనానికి (For the construction of the long awaited Solipuram Bridge)  ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు మోక్షం లభించింది.

ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం అన్నీ తానై కసరత్తు జరిపిoచిన మంత్రి జగదీష్ రెడ్డి ఎట్టకేలకు (Minister Jagdish Reddy who has done all the work himself finally) ప్రజలకిచ్చిన దృష్టికి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాజకీయాలకతీతంగా గ్రామస్తులు అందరూ ముక్తకంఠంతో మంత్రి దృష్టికి తీసుకరావడంతో సత్వరమే స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి సాంకేతికంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డి పి ఆర్ రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతులు (Chief Minister KCR approved the DPR to avoid problems) తీసుకోవడంతో సోలిపురం సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిoది.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఎన్నికలు పూర్తి అయిన మీదట ఎప్పటి మాదిరి గానే అటకెక్కుంటుందేమో అనుకున్న తీరుకు భిన్నంగా బ్రిడ్జి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ కావడంతో మునుగోడు మండలం సోలీపురం గ్రామస్తులు హర్షాతిరేకాలు (Villagers of Solipuram of Munugodu mandal are jubilant as the order for construction of the bridge has been issued) వ్యక్తం చేస్తూ సో హ్యపీ గా ఫీలవుతున్నారు. ఏది ఏమైనా సోలిపురం కథ సుఖాంతమైందని చెప్పవచ్చు.