Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mustabu for the start of Mallanna Brahmotsavam: మల్లన్న బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముస్తాబు

--13వ తేదీ నుంచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు --కన్నుల పండువగా మల్లికార్జున స్వామి జానపదుల జాతర --సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు --భక్తులకు సమస్యలు తలెత్తకుండా సకల సదుపాయాలు

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సిద్దం

–13వ తేదీ నుంచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు
–కన్నుల పండువగా మల్లికార్జున స్వామి జానపదుల జాతర
–సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు
–భక్తులకు సమస్యలు తలెత్తకుండా సకల సదుపాయాలు

ప్రజా దీవెన/ హన్మకొండ: ఉత్తర తెలంగాణ వాసులు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు ( Ainavolu Mallanna Temple for Brahmotsavam)  సర్వం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఉగాది వరకు సాగే జాతరకు భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. ఈ ఏడాదిలోనే సమ్మక్క-సారలమ్మ జాతర ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. బోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద పట్నాల తో మల్లికార్జున స్వామి జానపదుల జాతర కన్నుల పండువగా సాగనుంది.

రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు అన్ని విధాలా ఏర్పాట్లు ( Hanumakonda District Ainavolu Sri Mallikarjuna Swamy Temple All arrangements for Brahmotsavam) ముగిశాయి. ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలు, అద్భుతమైన శిల్ప సంపదతో ప్రకృతి రమణీయతను పంచే ఆలయం భక్తులను మంత్ర ముగ్ధులను చేయనుంది. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆలయంలో ప్రతి సంవత్సరo సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్స వాలు జరుగుతాయి.

ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ సహా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కు లు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈనెల 13వ తేదీ సంక్రాంతి ఉ త్సవాలు ప్రారంభం కానుండగా 14, 15వ తేదీల్లో బండ్లు తిరుగుట, 16న మహా సంప్రోక్ష సమారాధన (While the Sankranti festival will begin on the 13th of this month, there will be a procession of carts on the 14th and 15th, and the Maha Samproksha Samaradhana on the 16th) జరగనుంది. ఫిబ్రవరి 2వ తేదీన భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహించనున్నారు.

మార్చి 9నుంచి 13వరకు శివరాత్రి కల్యాణోత్సవాలు, ఏప్రిల్‌ 13న ఉగాది కార్యక్రమాలతో ముగుస్తా యని ఆలయ ప్రధానార్చకులు వెల్ల డిస్తున్నారు. మకర సంక్రాంతి పండుగ రోజు మనకు బాగా వర్షా లు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో చుట్టుపక్క ల ఉన్న గ్రామల రైతులు ఎడ్ల బండ్లతో ప్రభలను నిర్వహించడం ద్వారా వారి భక్తిని చాటుకుం టారు. అదే విధంగా ఈ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా కూడా ఐదు రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ( Special Brahmotsavams are held for five days on the occasion of Maha Shivratri in the temple)  జరుగుతాయి.

ఉగాది ముందు వచ్చే చివరి ఆదివారం సైతం స్వామివారికి సుమా రు 50 అడుగుల విస్తీర్ణంతో పెద్ద పట్నం కార్యక్రమం నిర్వహించబడు తుంది. ఈ ఏడాది ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతర ఉండటం తో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. లక్షలా దిగా తర లివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టా రు.

అదనపు క్యూలైన్లు, తాగునీరు, చలవ పందిళ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వా హణ అధికారి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు ( Strict measures have been taken by the authorities to prevent any untoward incidents from happening in the fair)  చేపడుతున్నా రు. భక్తులు గతం లో కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం.

అంటే సుమారు 9 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచ నా వేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదు పాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మరి మళ్లీ వస్తుండడంతో దానిని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ అధికారుల ఆదేశాల మేరకు ఒక్కొక్కరుగా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల కు కరోనా భయం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా సిద్ధం చేస్తున్నారు.