Nagarjuna Sagar dead storege : బిగ్ బ్రేకింగ్, డెడ్ స్టోరేజ్ లో నాగార్జునసాగర్, వరివేస్తే తీవ్రనష్టమని మంత్రుల హెచ్చరిక

Nagarjuna Sagar dead storege : ప్రజా దీవెన, హైద రాబాద్: నల్ల గొండ జిల్లా ప్రాణధార అయిన నాగార్జునసా గర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరడంతో ఆయక ట్టు రైతాంగానికి ప్రభు త్వం తీవ్ర హెచ్చరికలు జారీ చే సింది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షా లు పడే అవకాశం లేనందున, సా గునీటిపై ఆశలు వదులుకొని వరి పంటకు పూర్తిగా దూరం గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది.
సీఎస్, మంత్రుల ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్
శుక్రవారం హైదరాబాద్ నుంచి నీ టిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉ త్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వర రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులతో క లిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎల్ నినో (El Niño) ప్రభావం, నీటి నిల్వ లు, ఆరుతడి పంటల సాగుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించా రు.
తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం
ప్రాజెక్టులోని ప్రస్తుత నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపో తుంది. చెరువుల్లో కూడా నీళ్లు లేవు. ఎక్కడి నుంచీ ప్రాజెక్టులోకి సాగునీరు వచ్చే అవకాశం లేదు. వరి వేసి రైతు లు అనవసరంగా నష్టపోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది.జిల్లా స్థాయిలో వెంటనే నీటి పా రుదల సలహా సంఘం (IAB) స మావేశాలు ఏర్పాటు చేసి, భూ గర్భ జలాలు, వర్షపాతం, నీ టి లభ్యతపై రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని పేర్కొంది.
రైతులకు తోడుగా ప్రభుత్వం: జిల్లా కలెక్టర్
వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంబంధిత అధికారు లతో అత్యవసర స మావేశం నిర్వహించారు. వరి స్థానంలో వేసే ఆరుతడి (త క్కువ నీటి) పంటల కు కావలసిన విత్తనాలు, ఎరువు లను ప్రభుత్వమే ఉచితంగా/రా యితీపై అందిస్తుందని వెల్లడిం చారు. వ్యవసాయ విస్తరణ అ ధి కారులు (AEOలు) మండ లాల వారీగా పర్యటించి, ప్రత్యామ్నా య పంటల వివరాలు సేకరించి వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని క లెక్టర్ ఆదేశించారు. ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రే మ్ కరణ్ రెడ్డి, DRDO శేఖర్ రె డ్డి, ఇతర వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు ఈ వీడి యో కాన్ఫరెన్స్ లో ఉన్నారు.





