
Nalgonda 2k run on drugs free : ప్రజా దీవెన, నల్ల గొం డ క్రైమ్: అది కేవలం రెండు కిలోమీటర్ల పరుగు కాదు ఒక ఉమ్మడి శత్రువుపై నల్ల గొండ యువత ఎక్కుపెట్టిన అస్త్రం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్య తిరేక దినోత్సవం సంద ర్భంగా నల్ల గొండ వీధులు సరికొత్త చైతన్యానికి వేదికయ్యా యి. “మాదకద్రవ్యాలు వద్దు-ఆరోగ్యకరమైన భవిష్యత్తే ము ద్దు” అనే నినాదంతో ఎన్.జి. కళాశాల గ్రౌండ్స్ నుండి క్లాక్ ట వర్ వరకు సాగిన 2కే రన్ (2K Run) పట్టణంలో ఒక కొత్త ఊపును తెచ్చింది.
పొద్దు పొద్దుగాల ఎన్ జి కళాశాల ఆవరణ అంతా యువత రణగొణ ధ్వనులతో, ఉత్సాహంతో మార్మో గిపోయింది. జి ల్లా కలెక్టర్ చంద్రశే ఖర్ , జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సం యుక్తంగా జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించడమే కాకుం డా, స్వయంగా తామే ట్రాక్ సూట్లు వే సుకుని యువతతో పాటు అడుగు లు కలపడం విశేషం. కలెక్టర్, ఎస్పీ లను త మతో పాటు పరుగెత్తడం చూసిన విద్యార్థుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

లీడర్స్ మాట.. భవిష్యత్తుకు బాట
మాదకద్రవ్యాల మహమ్మారి ఒక్క వ్యక్తిని కాదు… ఒక కు టుంబానికి, సమాజానికి తలవంపులు తెస్తుంది. విద్యార్థు లు మత్తు పదార్థాల వై పు కాకుండా, తమ జీవిత లక్ష్యాల వైపు పరుగు తీయాలి. ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ మన అందరి ఉ మ్మడి బాధ్యత అంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చం ద్రశేఖర్ సందేశం ఇచ్చారు.
డ్రగ్స్ అనేవి కేవలం ఆరోగ్య సమస్య కాదు, సమాజ శాంతి భద్రతల కు పెను ముప్పు అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచి పెట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టోందని, ఎక్కడైనా అనుమానాస్ప ద కదలికలు కనిపిస్తే వెంటనే మా కు సమాచారం ఇవ్వాలని ప్రజల సహకారంతో నే నల్గొండను క్లీన్ చేయగలమని పిలుపునిచ్చారు.
క్లాక్ టవర్ వద్ద ముగిసిన చైతన్య యాత్ర లో పోలీస్ అధికా రులు, వి ద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, నల్గొం డ వాసులు ఒకరి నొకరు ప్రోత్సహించుకుంటూ రెండు కిలో మీటర్ల లక్ష్యాన్ని ముద్దాడారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ చే రుకున్న రన్. “డ్రగ్ ఫ్రీ నల్గొండ” సం కల్ప సభగా మారింది.ఈ కార్యక్ర మంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రె డ్డి.సీఐ నాగరా జు, ఎస్‌ఐలు సైదా బాబు, శివ ప్రసాద్‌లతో పాటు సిబ్బంది, వంద లాది మంది విద్యార్థులు, యువ త, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.





