Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 1:22 pm Posted by : praja deveena

Nalgonda BRS raises Grain Frauds : రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరు మార్గం, కలెక్టర్ కు ధాన్యo అక్ర మాలపై లిఖితపూర్వక ఫిర్యాదు

Nalgonda BRS raises Grain Frauds : ప్రజా దీవె న, నల్లగొండ: అన్నదాత లను నిలువునా ముంచుతున్న ధా న్యo సేకరణ అక్రమాలపై నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పోరు మార్గం ఎంచుకున్నారు. ఐకేపీ కేంద్రాల్లో జరుగు తోన్న మాయాజాలాన్ని ఆధారాలతో సహా గురిపెట్టి, రైతుల తరఫున కలెక్టరేట్‌లో గళమెత్తారు. బుధ వారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి అక్ర మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అన్ని సా క్ష్యాధారా లను కలెక్టర్ ముందు ఉం చారు. తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ట్రక్ షీట్ల మా యాజాలం కనగల్ మండలం జి.ఎడవెల్లి ధాన్యo సేకరణ కేంద్రాల్లో అమా యక రైతులను నిలువునా దోచుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇంత వరకు చర్యలు తీ సుకోలేదని గుర్తు చేశారు.రైతు చేతికి ఇచ్చే ట్రక్ షీట్‌లో ఒక రకమైన తూకం చూపిస్తూ మిల్లర్ వద్దకు వెళ్లేసరికి మరో తూకంతో కూడిన డూప్లికేట్ ట్రక్ షీట్‌ను సృ ష్టిస్తున్నారు.ఈ నిలువు దోపిడీకి సంబంధించిన పక్కా ఆధారాలను కం చర్ల భూపాల్ రెడ్డి కలెక్టర్‌కు అందజేశారు.

అదే విధంగా తిప్పర్తి,ల మండలం మర్రిగూడెం, ఇండ్లూరు, మామిడాల కేంద్రాల్లో స్థానిక రై తులను పక్కనబెట్టి, పక్క రాష్ట్రా ల నుండి వచ్చే ధాన్యాన్ని కొను గోలు చేస్తున్నారని స్థానిక నాయ కులు, నిర్వాహకులు కుమ్మక్కై సాగిస్తున్న ఈ మాఫియా దందాను మా నాయకులు గతంలోనే ఆధా రాల తో సహా బయటపెట్టినా, అ ధి కారులు ఇంతవరకు ఎలాం టి చర్యలు తీసుకోకపోవడంపై భూపా ల్ రెడ్డి తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు.

నల్లగొండ మండలంలో అన్నెపర్తి ధాన్య సేకరణ కేంద్రంలో సీజన్ ముగుస్తున్నా ఇంతవరకు కనీసం 25 శాతం కొను గోళ్లు కూడా జరగలేదని, దీనివల్ల రైతులు ఆందోళన చెందు తు mన్నారని, వెంటనే స్పం దించి కొనుగోళ్లను వేగవంతం చే యాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమర్పించిన పక్కా ఆధారాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ అక్రమాలపై స మ గ్ర విచారణ జరిపి, తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామ ని, ధాన్య సేకరణను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేంద ర్, మాజీ కౌ న్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అన్నె పర్తి సర్పంచ్ మేక అరవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఎలుక శ్రీనివాస్ రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, నాయకులు పెఱిక కరుణ్, జయరాజ్ మరి యు ఆయా గ్రామాలకు చెందిన బాధి తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.