OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda BRS raithu Mahadharna : నల్లగొండ బిఆర్ఎస్ ‘మహాసంగ్రా మం’, రైతు వ్యతిరేక విధానాలపై ముక్తకంఠంతో గళమెత్తిన నేతలు 

Nalgonda BRS raithu Mahadharna : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వేదికగా కాం గ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నా కే వలం ఒక నిరస నలా కాకుండా, బీఆర్ఎస్ (BRS) రాబోయే కా లంలో పవర్‌లోకి రావ డానికి గల స్పష్టమైన పొలిటికల్ అ జెండాను చాటిచెప్పిందని చెప్ప వచ్చు. ఈ ధర్నాలో మా జీ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎం పీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఒంటెద్దు నర్సింహా రెడ్డి  స హా వేలాది మంది రైతులు, గులాబీ సైని కులు కదం తొక్కారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమా ర్ సీఎం రే వంత్ రెడ్డి లక్ష్యంగా భవిష్యత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు కేసీఆర్ సీఎం ఉన్న ప్పుడు పంట చేతికి రావడాని కి మూడు నెలల ముందే రి వ్యూలు చేసి, కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపించారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు రి వ్యూలు చేస్తున్నారట, ఆరివ్యూలు రైతుల కోసం కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసం, మూసి సుందరీకరణ వెనుక ఉన్న వ్యాపారాల కోసం మాత్రమేనని దు య్యబట్టా రు. ప్రధాని మోదీ పక్కన కూర్చుని రేవంత్ రెడ్డి రైతుల గు రించి అడగలేదని, కేవలం తన రియల్ ఎస్టేట్ ప్రయోజనా ల కోసమే అడిగారని ఆరోపించారు.

బండి సంజయ్ కొడుకు కేసులో బాధితురాలైన అమ్మాయిపై నే రి టర్న్ కేసు పెట్టించిన ఘోరమైన చ రిత్ర ఈ ప్రభుత్వాని దని, కేసీఆర్, కే టీఆర్ రంగంలోకి దిగితేనే 9 రోజుల తర్వా త అరెస్ట్ జరిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలి సి డ్రామాలు చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.ఇలాంటి దుర్మా ర్గులను రక్షిస్తూ, రాష్ట్రాన్ని దోచుకుని పారిపోవడమే రేవంత్ లక్ష్యమని, అందుకే ప్రజలు మళ్ళీ కేసీఆర్‌ను సీఎం చేసుకో వడం ఖాయం, ఇది కాలం రా సిన రాతని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు.

 

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తన మార్క్ స్పీచ్‌ తో కాం గ్రెస్ మంత్రులపై, ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో వి రుచుకుపడ్డారు.”కేసీఆర్ రాకముందు తెలంగాణ లో రైతుల కష్టాలు, ఫ్లోరైడ్ భూతం ఎలా ఉండేవో సరిగ్గా 12 ఏళ్ల త ర్వాత కాంగ్రెస్ తెచ్చిన శాపంతో మళ్ళీ అదే దుస్థితి వచ్చిం దని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్లగొండ పై ప్రత్యేక దృ ష్టి పెట్టి, 2013లో కేవ లం 3 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉ న్న ధాన్యపు దిగుబడిని 2023 నా టికి 40 లక్షల మెట్రిక్ టన్ను లకు కేసీఆర్ పెంచారని, కరోనా కష్టకా లంలోనూ కల్లాల వ ద్దకే వచ్చి కొనుగోలు చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడుతూ గుర్తు చేశారు.

   మిల్లర్లతో మంత్రుల కుమ్మక్కు

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులపై జగదీష్ రెడ్డి తీవ్ర ఆరో పణలు చేశారు. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డికి అస్సలు సో యి లేదని, హెలికాప్టర్లు లేనిదే ఆ యన కాలు కదపరని, ధాన్యం కొ నుగోళ్లపై కనీసం రివ్యూ చేసే తీ రిక కూడా లేదoటూ ఎద్దేవా చేశారు.మిల్లింగ్ మాఫియాతో జిల్లా మం త్రులు కుమ్మక్కై కమిషన్లు దండు కుంటున్నారని, అందుకే క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తూ రైతుల ర క్తాన్ని తాగుతున్నా మంత్రులు మౌ నంగా ఉన్నారని ఆరోపించా రు. వడ్లలో తరుగు తీస్తే రైతులు చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నా యని హెచ్చరించారు.

నేను మంత్రిగా ఉన్నప్పుడు రోజుకు 500 కిలోమీటర్లు కా ర్ల లో తిరుగుతూ, రోజుకు మూడు రివ్యూలు చేస్తూ రైతులను కడుపులో పెట్టు కుని చూసుకున్నామని, ఇప్పుడు ఒక్క మంత్రి కూడా క్షేత్రస్థాయిలో కనపడటం లేదని విమర్శించా రు.ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన కాంగ్రెస్ కాద ని, ఇది మోదీ, చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ అని జగదీష్ రెడ్డి అభివ ర్ణించారు. కాంగ్రెస్‌లోని లీడర్లు సైతం ఈ పాలన నచ్చక బీఆర్ఎస్‌ తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉ న్నారని భవిష్యత్ రాజకీయ బాంబు పేల్చారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెంటనే దోపిడీని ఆపి, తడిసిన ధా న్యంతో సహా ప్రతీ గింజనూ భేషరతుగా కొనాలని డిమాం డ్ చేస్తూ రైతుల ప క్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగేది లేదని హె చ్చరించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కటికo సత్త య్య గౌడ్, నిరంజన్ వలీ, మందడి సైది రెడ్డి, రేగట్టే మల్లి కా ర్జున్ రెడ్డి, తండు సైదులు గౌడ్, మాలే శరణ్య రెడ్డి, కరీం పా షా, కంచర్ల కృష్ణారెడ్డి, జమాల్ ఖాద్రి, సింగం రామ్మోహన్, బో నగిరి దేవేందర్,  రావుల శ్రీనివాస్ రెడ్డి,  యాదగిరి తది తరు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button