Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 2:17 am Posted by : praja deveena

Nalgonda brutal murder case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో దారుణహత్య, భార్యాభర్తల్లో గొడవల నే పథ్యంలో ఘాతుకం ?

Nalgonda brutal murder case : ప్రజా దీవెన,నల్లగొండ క్రైమ్: న:ల్లగొండ జిల్లా కేంద్రంలోని చైత న్యపురిలో దారుణ హత్య కలకలం రేపింది. అంతర్‌కుల వివాహం చేసుకున్న బం టు వెంకటేశ్వ ర్లు (37) అనే యువకుడు హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబకలహాలుఈ ఘటనకు కారణ మై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.స్థానికుల కథనం ప్రకా రం.. వెంకటేశ్వర్లు, ఆయన భార్య మధ్య గత కొన్ని రో జులుగా గొడవలు జరుగుతున్న ట్లు తెలుస్తోంది. ఈ నేప థ్యంలో భార్య సోదరులే వెంకటేశ్వర్లుపై దాడిచేసి, కళ్లలో కారం చల్లి హ త్య చేసినట్లు స్థానికులు ఆరో పిస్తున్నారు. అయితే ఈ ఆరోప ణలపై పోలీసుల నుంచి అధి కా రిక నిర్ధారణ రావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి హుటాహుటిన ఘ టనా స్థలానికి చేరుకుని పరిస్థి తిని పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసుకు సంబంధిం చిన వివరాలను సేకరిస్తూ విచా రణ చేపట్టారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ హత్య వెనుక అసలు కార ణాలేమిటి? కు టుంబ కలహాలే ఘాతుకానికి దారితీశాయా? స్థా నికులు చే స్తున్న ఆరోపణల్లో వా స్తవమెంత? అనే కోణాల్లో పో లీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉం ది.