Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 12:30 pm Posted by : praja deveena

Nalgonda collecter bhagiratha jayanti : నల్లగొండకలెక్టర్ చంద్రశేఖర్ కీలకవ్యాఖ్య, పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి

 

Nalgonda collecter bhagiratha jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: పట్టుదల కు మారుపేరు భగీరథ మహర్షి అని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో భగీరథ మ హర్షి జయంతి ఉత్సవాల సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘ నం గా నివాళులర్పించారు. కఠోర దీక్ష, పట్టుదలతో గంగను దివి నుండి భువికి తీసుకువ చ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చే సిన మహనీయుడని అన్నారు.

ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, భవిత రాలకు ఆ స్ఫూర్తిని అందించాల్సిన అవస రం ఉందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు చేరవే యడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. పనిలో అ వరోధాలు వచ్చినా వాటిని ధైర్యం గా ఎదుర్కొని కృషి చే స్తే ఏ లక్ష్యా న్నైనా సాధించవచ్చని భగీరథ మహర్షిని ఉ దా హరణగా చెబుతారని అన్నారు.అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సగర సంఘo తరఫున పని కల్పిస్తామన్నారు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాల గురించి వివరించారు. గృహజ్యోతి, మ హాలక్ష్మి, ఇందిర మ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ బియ్యం వంటి సం క్షేమ పథకాలు సగరం సంగంలో అర్హులైన ప్రతి కుటుం బా నికి చేరేలా చూస్తామన్నారు. అర్హు లైన సగరులు పథకాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకో వాలని,జిల్లా స్థా యిలో పరిశీలించి, అర్హులకు ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ని ర్మాణరంగంలో పనిచేస్తున్న సగ రులు, కార్మికులు లేబర్ కార్యాల యంలో నమోదు చేసు కుంటే అ నుకోని సంఘటనల సమయంలో సహాయం అందే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకుందని తెలి పా రు. సగరo సంఘం తరఫున అ ర్హుల జాబితా అందిస్తే వా రికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్,సమాచార శాఖ స హాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు సగ ర,బీసీ వెల్ఫేర్ అధికారి సంజీవ య్య, సగరం సంగం అధ్యక్షులు ర వికు మార్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర, జిల్లా కార్యదర్శి కరుణాకర్ సగర, తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థ ల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి , గృ హ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ ఏ వో మోతిలాల్, బీసీ సంక్షేమ శా ఖ సి బ్బంది, జిల్లా సాగర సంగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నా రు. అంతకు ముందు జిల్లాసగర సంగం ఆధ్వర్యంలో నల్గొండ పట్ట ణం లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
.