Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 3:25 pm Posted by : praja deveena

Nalgonda collecter humanity : బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శించిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాద క్షతగాత్రునికి సహాయం

బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శిం చిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాద క్షతగాత్రునికి సహాయం

Nalgonda collecter humanity:  ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సమయాను కూ లంగా మానవత్వం ప్రదర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గా యపడిన క్షతగాత్రునికి సత్వర వైద్య సేవలు అదేవిధంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా కలెక్టర్ అక్కడికక్కడే అధికా రులను అప్రమత్తం చేశారు. కొండమల్లే ప ల్లి నుంచి నల్ల గొం డకు ప్రయాణిస్తున్న వెళుతున్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రోడ్డు ప్రమాద ఘటనకు స్పందించి దగ్గరుండి క్షతగాత్రుడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేప ట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం కొండమల్లేపల్లిలో నిర్వ హించిన బత్తాయి రైతుల సమావేశంలో పాల్గొ ని నల్లగొండ జిల్లా కేంద్రానికి తిరు గు ప్రయాణమైన జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ధర్వేశిపురం వద్దకు రాగానే అప్పుడే చోటు చేసుకు న్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనగల్ కు చెం దిన యువకుడు పరుశురాంకు సహాయకారిగా నిలిచారు.

క్షతగాత్రుడు రక్తపుమడుగులో పడిఉండగా గమనించిన క లెక్టర్ వాహనం దిగివచ్చి తక్షణమే అంబులెన్స్ కు, పోలీసు లకు సమాచారం అందించి క్షతగాత్రున్ని అంబులెన్స్ లో జి ల్లా కేంద్రానికి పంపించారు. అంతేకాక ట్రాఫిక్ సమస్య ఏర్ప డకుండా వాహనాలను దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేయిం చా రు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని దగ్గరుండి అంబులెన్స్ లో ఆస్పత్రికి పంపించిన జిల్లా కలెక్టర్ మాన వ త్వo పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచాడు. ఈ మేరకు కనగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.