Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:35 am Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, ఈ నెల10 వరకు జిల్లాలోని ప్రతి ఒక్కరుస్వీయగణన చేసుకోండి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: 2027 జ నగణన లో భాగంగా స్వీయగణన చే సుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉంద ని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకో వాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజ ల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవా రం ముఖ్య ప్రణాళిక అధికారి, నల్గొండ మున్సిపల్ కార్పొరే షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన “జనగణన నడకను” జిల్లా కలెక్టర్, న ల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ఎన్ జి కళా శాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలో జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ 2027 జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గ ణన ,గృహాల లెక్కింపు , జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నె ల 26 నుండి ప్రారంభ మైన స్వీయ గణన ఈనెల 10తో ముగుస్తుందని, జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని వారి వివరా ల న్నింటిని ఇవ్వాలని కోరారు. ఇంటిలో నుండే స్వీయ గణన చేసుకో వచ్చని,16 భాషల్లో గణన చేసుకు నేందుకు అవకా శం ఉందని, మొబై ల్ లొనే స్వీయ గణన చేసుకోవచ్చని, ఇ దిచాలా సులభమని తెలిపా రు. ఈ నెల 11 నుండి ఎ న్యు మరేటర్లు ఇల్లిల్లు తిరిగి హౌస్ లిస్టింగ్ చేస్తారని చెప్పారు. దే శ ప్రణాళిక, భవిష్యత్తు అభివృద్ధి అన్ని ప్రాంతాలను సమా నంగా అభివృద్ధి చేసేం దుకు జనగణన ఉపయోగపడు తుందనిఅన్నారు.

అనంతరం పట్టణంలోని పెద్ద బండ వద్ద స్వీయ గణన పై ఏర్పాటు చే సిన ప్రత్యేక శిబిరంలో కలెక్టర్ పాల్గొని మాట్లా డుతూ స్వీయ గణన సందర్బంగా అద్దె ఇంట్లో ఉన్న అ క్క డి నుండే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జన గణ మన సందర్భంగా సరైన సమాచా రం ఇవ్వాలని, ఇది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అ న్నారు .జనగణన జనాభా లెక్క లకు తప్ప ఇతర దేనికి ఉపయో గించడం జరగదని, అందువల్ల ఎవరు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇంట్లో ఉన్న వారందరి వివరాలను తెలియజేయాలని, కు టుంబానికి ఒక ఎన్యుమరేషన్ ఐడి వస్తుందని దీని ఆధా రంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణన జా ప్యం లేకుండా త్వరత్వరగా చే సుకునేందుకు వీలవుతుంద న్నారు .జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉండగా, 5,50, 000 ఇండ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివర కు 12000 కుటుంబాలు స్వీయగ ణన చేసుకోవడం జరిగిందని తక్కి న వారందరూ కూడా స్వీయ గణ నలో భాగస్వాములు కావాలని పునరుద్ఘాటించారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వీయ గ ణన పై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం” జనగణన వాక్” నిర్వహించడం జరిగిందని, అభివృద్ధికి జ నాభా ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రజలు ఇంటి నుండే సెల్ ఫోన్ లో స్వీయ గణన చేసుకోవచ్చని, ఇందుకు కేవలం 10 పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని ,స్వీయ గణ నకు రెండు రోజు లు మాత్రమే అవకాశం ఉన్నందున జిల్లా లోని ప్రతి ఒక్కరు స్వీయ గణ న చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశా రు.

డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సిపిఓ శ్రీనివాస్ నాయక్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, జిల్లా క్రీడలు యువ జన సర్వీసుల అధికారి అక్బర్ అ లీ, తహసిల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, త దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.