
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: భవిష్యత్తు కు బలమైన పునాది విద్య అని నల్ల గొం డ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖ ర్ అన్నారు.ప్రజా పాలన ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్ర ణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆది వారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయో త్సవ కార్యక్రమానికి జిల్లా కలె క్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ను అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన 13 మంది ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల నగదు బహు మతిని అందజేశారు.కేజీబివి, మోడల్ స్కూల్‌లకు చెందిన 5 మంది విద్యార్థులు, స్పోర్ట్స్ స్కూల్ నుం డి 4 మంది, జూనియర్ కళాశాల ల నుంచి 3 విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు స్ప ష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇష్టం తో, కష్టపడి చద వాలని చెప్పారు. పదవ తరగతితో చదువును ఆప కుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యా భ్యాసం కొనసాగించాలని, పోస్ట్ గ్రా డ్యుయేషన్ వరకు చదివితేనే నేటి పోటీ ప్రపంచంలో మంచి అవకాశా లు లభిస్తాయని అన్నారు. గ్రాడ్యు యేషన్ విద్యతో జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని తెలి పారు.
పై చదువులకు వెళ్లే విద్యార్థులకు సరైన దిశానిర్దేశం అవసర మని, ఉ పాధ్యాయులు, ఎంఈఓలు విద్యార్థులను ప్రోత్స హించే బాధ్యత తీ సుకోవాలని కలెక్టర్ చెప్పారు. పదవ తర గతి పూర్తి చేసిన విద్యార్థు లు ఇంటర్మీడియట్ లేదా పాలిటె క్నిక్ వంటి కోర్సుల్లో చేరేలా ప్రోత్స హించాలని కోరారు.
అ నంతరం మానసిక దివ్యాంగులకు అవసరమైన కిట్‌లను జిల్లా కలెక్టర్ అంద జేసి వారి పట్ల సామాజిక బాధ్యతను తె లియజేశారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి ద స్రునాయక్, జిల్లా వి ద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎంఈ ఓ లు, ఉపాధ్యాయులు, విద్యార్థు లతల్లిదండ్రులు హాజర య్యారు.





