Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 4:01 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం,నూరుశాతం ధాన్యం కొను గోళ్ల ట్యాబ్ఎంట్రీలు పూర్తి చేయాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ధాన్యం కొ నుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్ల క్ష్యం లేకుండా ట్యాబ్ ఎంట్రీలు పూ ర్తి చేయాలని నల్లగొండ జిల్లా క లె క్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం ఉదయా దిత్య భవన్‌ లో ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు, మిల్లర్లు, సంబంధి త అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ధాన్యం కొ నుగోలు చేసిన అనంతరం సం బంధిత వివరాలను ట్యాబ్‌ లో వెంటనే నమోదు చేసి,100 శాతం డేటా ఎంట్రీ పూర్తయ్యే వరకు ఆపరేటర్లు పని చేయా లని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేయాలని తెలి పారు.

మిల్లర్లు ట్రక్ షీట్లను పూర్తిగా సిద్ధం చేసి సమర్పించాలని, ధాన్యం తరలింపులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసు కోవాలని కలెక్టర్ తె లిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తర లించి, రైతులకు చెల్లింపులు ఆల స్యం కాకుండా పనిచేయాలని సూ చించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రి య పారదర్శకంగా, వేగవంతంగా సాగేందు కు అధికారులు, మిల్లర్లు, డేటా ఎంట్రీ సిబ్బంది సమిష్టిగా బా ధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు.

 

రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీ ని వాస్,పౌరసరఫరాల డి జిఎం టీబీ ఎస్ఎన్ ప్రసాద్, జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిసిఓ ప త్యా నాయక్,పౌరసరఫరాల డిఎం రాం పఠీ నాయక్, రైస్ మిల్లుల ప్రతి నిధులు ఉన్నారు.

పారదర్శకంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ

నల్లగొండ : ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ను పారదర్శ కంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పేర్కొ న్నారు. ఎస్‌ఐఆర్ (Special Inte nsi ve Revision) ప్రక్రియను ఎన్నికల నియమ నిబంధనలకు లో బడి ఆదర్శవంతంగా నిర్వహించా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాం బర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో నిర్వహించిన సమావే శం లో మాట్లాడుతూ 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తు తం ఆ ఓటర్ల పరిస్థితి, 2002 త ర్వాత కొత్తగా జాబి తాలో చేరిన వారి అంశాలను పరిశీలిస్తూ 2026 ఓటరు మ్యాపింగ్ చేపట్టాలని తె లిపారు.

ఇప్పటివరకు 80.65 శాతం ప్ర క్రి య పూర్తయిందని, తక్కిన ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సు మారు 10శాతం మంది వచ్చిన వారి వివ రాలను సేకరించి ధృవీకర ణ చేపడతామని చెప్పారు. ఈ ప్ర క్రియకై 1575 మంది బీఎల్ఓలను నియమించామని,అన్ని రాజకీయ పార్టీల నుండి బీఎల్ఏలుగా ప్రతినిధులను ని యమించాలని, వారి వివరాలను వీలైనంత త్వరగా అం ది స్తే మ్యాపింగ్ ప్రక్రియ మరింత వే గవంతమవుతుందని తెలి పారు.

 

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు కు ఎన్యూమరేషన్ 2 ఫా రాలు అందజేస్తామని, ఓటర్లు ఒక దా నిని పూరించి సమ ర్పించాలని చె ప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో అవకాశం కల్పించామ ని వివరించారు.ఓటరు గుర్తింపు కో సం ఎన్నికల సంఘం సూచించి న 12 రకాల ధృవీకరణ ప త్రాలలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉం టుందని తెలిపా రు. డబుల్ ఓట్లు లేకుండా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓ టు ఉం డేలా చర్యలు తీసుకుంటున్నామని, మార్పులు అవసర మై తే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసు కోవచ్చని చెప్పారు. 0 1- 10-2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచే సుకునే యువత ఓటరుగా నమో దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు.

మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శ కం గా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్, త్వరలో బిఎ ల్ఓలు మరియు బీఎ ల్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వ హించి పూర్తి స్థాయి అవగాహన క ల్పిస్తామని తెలిపారు. ఓటరు జా బితాకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారిని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి ముంతాజ్ ఎంఐఎం నుండి రజియోద్దీన్, బిఆర్ఎస్ పార్టీ నుం డి పంకజ్ యాద వ్, బిజెపి తర ఫు న లింగస్వామి, టిడిపి మల్లికా ర్జున్, బ హుజన సమాజ్ పార్టీ రవి కు మార్, యాదగిరి, సిపిఎం నుం డి నర్సిరెడ్డి అప్ పార్టీ అన్సారి, తదితరులు పాల్గొన్నా రు.