Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు, బాలి కల అభివృద్ధి కి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రా వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చా రు.ప్రజా పాలన ప్ర గ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా సోమవారం నుం డి నిర్వహిస్తున్న మహిళా వారోత్స వా న్ని పురస్కరించుకుని మంగళ వారం నల్గొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో మహిళ శిశు, దివ్యాంగులు, వయోవృ ద్ధుల సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివా హల రహిత తెలంగాణ లక్ష్యంతో “బాల్య వివాహ నిషేధ చట్టం– 20 06 ”పై విద్యార్థులకు ఉద్దేశించి నిర్వహించిన అవగాహన కార్య క్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ బాలికల అభి వృద్ధికి స మాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్య తగా ముందుకు రావాలి, బాల్య వివాహాలను అరికట్టేందుకు విద్యా ర్థులు చై తన్యవంతంగా వ్యవహ రించాలి, బాల్య వివాహాల వల్ల ఎం తోమంది బాలికల జీవితాలు దె బ్బతింటున్నాయి, కుటుం బాల్లో ఆ వేదన మిగులుతున్నదని అన్నా రు.విద్యార్థులు తమ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలపై పోలీసులు లేదా అధికారులకు సమాచారం అందించాలని, బాలికలు సంఘా లుగా ఏర్పడి తమ సమస్యలను పంచుకోవాలని సూచించా రు.
బాల్య వివాహాలను అరికట్టడంలో పంచాయతీ కార్యద ర్శు ల పాత్ర కీ లకమన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తు న్న వెల్ఫేర్ వీక్ ద్వారా పిల్లలకు అ నేక అవకాశాలు కల్పిస్తున్నదని, ప్ర తి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ పా టించాలని చెప్పారు. విద్యా ర్థులు సోషల్ మీడియాను అతి మోతా దులో ఉపయోగిం చకుండా జాగ్రత్త గా ఉండాలని, ఏఐ ఫోటో మా ర్ఫిం గ్ వం టి సైబర్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిం చారు.
ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఎంతో ముఖ్యమని, సమాజంలో తలెత్తు కుని జీవించేలా వ్యక్తిత్వాన్ని పెం పొందించుకోవా లని విద్యార్థులకు సూచించారు. బాలికల సమస్యల పై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అ ధికారులను ఆదేశించారు. చదు వుకోవాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వి ద్యార్థులు ప్రజావా ణిలో దరఖాస్తు చేసుకుంటే సహకారం అందిస్తామని తెలి పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రణామం వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడి వృద్ధులతో మా ట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తె లుసుకున్నారు. వృద్ధులు క్యారంస్ ఆడుతుండగా వారితో ఆప్యా యంగా ముచ్చటించారు. ఎం డలు తీవ్రం గా ఉన్న నేపథ్యంలో అన వ సరంగా బయట తిరగవద్దని సూ చించారు. అవగాహన కార్యక్రమా నికి రెడ్ క్రాస్ చైర్మ న్ గోలి అమ రేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపిఓ లావణ్య, సిడ బ్ల్యూసి చైర్మన్ చింత కృష్ణ య్య, సి డబ్ల్యూసి సభ్యులు భాస్కర్ వెంక న్న, డిసిపిఓ గణే ష్ హాజరయ్యా రు.

