Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, నెలాఖరులోగా మిర్యాలగూడ డబుల్ బెడ్‌రూమ్ పనులు పూర్తిచేయాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, మిర్యాలగూడ: మి ర్యాలగూడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పను లు ఈ నెలాఖరులోగా పూ ర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.గురువారం ఆ యన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాస్ న గర్ గుమస్తాల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ను పరిశీలించారు. జూన్ 2 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజే సేలా చర్యలు తీసుకోవాలని శాస నసభ్యు లు బత్తులలక్ష్మారెడ్డి అధికారులతో కోరారు.

 

అనంతరం మిర్యాలగూడ ఆర్‌డీఓ కార్యాలయంలో డబుల్ బెడ్‌రూ మ్ ఇళ్లపై కలెక్టర్, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించా రు. జూన్ 2న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పం పిణీ చేయనున్నందున సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, తా గునీటి ట్యాపులు, విద్యుత్ సౌక ర్యాలు, కిటికీలకు గ్లాసు లు, బా త్రూములు, ట్రాన్స్‌ఫార్మర్, స్ట్రీట్ లైట్లు తదితర అన్ని పనులను పూ ర్తి చేసి అప్పగించాలని, ఈ నెల 30వ తేదీలో గా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశిం చా రు. పార్కులు, వాటర్ ప్లాం ట్లు, గదుల శుభ్రత, సానిటేష న్, మరుగుదొడ్లు, మొక్కల నాటడం, మిషన్ భగీరథ నీటి సర ఫరా, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, పెయింటింగ్ పనులు పూ ర్తి చేయాలని చెప్పారు.

 

ప్రతి ఇంటికి నీటి ట్యాపులు, ఎల క్ట్రికల్ లైన్లు, పంప్ హౌస్‌ లు పరి శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే గుంతల రోడ్ల మరమ్మ తు లు మూడు రోజుల్లో పూర్తి చే యా లని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి లైన్లు పూర్తిచేయాల ని, తాగునీటి ట్యాంకులను పూర్తిగా శుభ్రం చేయించాలని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం తో పాటు కరెంట్, ఫ్యాన్లు, బోర్డుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఆర్డీవో రమణా రెడ్డి, తహసిల్దార్ శ్రీని వా స్, హౌసిం గ్ డిఇ శ్రీనివాస్, పంచాయతీ డిఈ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామకృష్ణలు ఉన్నారు.

Related Articles

Back to top button